Close

ఐటిఐ కోర్సుల్లో విద్యను అభ్యసించి స్థిరమైన ఉపాధిని పొందాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణ రాజు విద్యార్థులకు దిశా నిర్దేశించేశారు.

Publish Date : 04/04/2025

గురువారం భీమవరం ఐటిఐ నందు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో (ఐ ఎం సి) ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఐటిఐ క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలు పొందిన వారు వెంటనే మానేయకుండా కొంతకాలం స్థిరంగా పనిచేయాలని సూచించారు. తద్వారా అనుభవం, జీవితంలో ఎదగడానికి స్థిరత్వం లభిస్తాయన్నారు. ఉద్యోగమే కాకుండా, సొంతంగా వ్యాపారవేత్తగా కూడా స్థిరపడవచ్చు అని సూచించారు. ఏసీ మెకానిజం, సెల్ ఫోన్ రిపేర్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ వంటి వాటికి విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. విద్యార్థి దశలో బాధ్యతగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఉద్బోధించారు. ఐటిఐ, పాలిటెక్నికల్ కోర్సు ద్వారా మూడు శాతం ఉద్యోగ గ్యారెంటీ స్పష్టం చేశారు. ఫిట్టర్ కోర్స్ చదివినవారు అసలు దొరకటం లేదని, ఎవరైనా ఫిట్టర్ కోర్స్ ను పూర్తి చేసుకున్న వారు ఉంటే ఉద్యోగ అవకాశాన్ని నేనే కల్పిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో నియోజకవర్గ మొత్తం వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ను ఏర్పాటు చేస్తున్నామని వాటిలో పనిచేయడానికి ఫిట్టర్ కోర్స్ చదివినవారు అవసరం ఉన్నారు. వారి ఊరికి పది కిలోమీటర్ల లోపలోనే ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత నాది అని స్పష్టం చేశారు. ప్రజలకు మంచినీటి సదుపాయాన్ని అందజేసే కార్యక్రమంలో మీరు స్వయంగా భాగస్వామ్యులు అవుతారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఐటిఐ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనదన్నారు. పరిశ్రమలలో ఐటిఐ కోర్సులు చదివిన వారు అవసరం చాలా ఎక్కువగా ఉందని, మీ తమ్ముళ్లను, మీ స్నేహితులను కూడా ఐటిఐ కోర్స్ లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరం చాలా విలువైనదని, అనుభవంతో పాటు, శాలరీలో కూడా పెరుగుదలకు ఉంటుందన్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలను పొందడానికి అనుభవం దోహదపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎం.సి చైర్మన్ సామంతపూడి బాలకృష్ణం రాజు, ఐటిఐ ప్రిన్సిపాల్ వేగ్నేశ్న శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.