Close

ఏపీ టెట్ 2025 టీచర్స్ అర్హత పరీక్షలు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Publish Date : 08/12/2025

సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహణకు తీసుకోవలసిన చర్యలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 10 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు జరగనున్న టెట్ పరీక్షలు నిర్వహణకు జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భీమవరంలో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఉమెన్స్, డిఎన్ఆర్ కాలేజీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దంతులూరి నారాయణ రాజు కాలేజీ అటామస్, నరసాపురంలో స్వర్ణాంధ్ర కాలేజీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలు మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 గం.ల నుండి మధ్యాహ్నం12.00 గం.ల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గం.ల నుండి సాయంత్రం 5.00 గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఏపీ టెట్ పరీక్షలకు జిల్లాలో 12,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాలు సమీపంలో ఎటువంటి జిరాక్స్ షాపులు నిర్వహించకుండా మూసివేయాలని ఆదేశించారు. పదవ తేదీ నుండి 21వ తేదీ వరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చెయ్యాలని వైద్య ఆరోగ్య శాఖ వారికి ఆదేశించారు. త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయాల్లో ఆయా రూట్లలో బస్సులు అంతరాయం లేకుండా తిరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

పదవ తరగతి విద్యార్థులకు వందరోజుల కార్యాచరణ అమలు ద్వారా నూరు శాతం ఫలితాలు సాధించాలి..

ఎంపీడీలు, మండల స్థాయి అధికారులు ప్రతి ఉన్నత పాఠశాలలకు వెళ్లి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవుతున్నది లేనిది పరిశీలించాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలపై చర్చించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలన్నారు. విద్యార్థుల నుండి స్పందన తెలుసుకొని విద్యాశాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పెద్ద పాఠశాలల్లో జిల్లా అధికారులు సందర్శించి వందరోజుల ప్రణాళిక అమలును పర్యవేక్షించాలన్నారు

ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డీఈవో ఇ.నారాయణ, ఏపీఈపీడీసీఎల్ ఎస్.ఇ పులి శాంతి, డిటిఓ కృష్ణారావు, డిఅండ్ హెచ్ ఓ డాక్టర్ గీతా బాయి, భీమవరం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఏ.రాంబాబు, ఆర్టీసీ ఆర్ఎం, వీరి శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.