ఎస్ హెచ్ జి మహిళలకు గ్రూప్ లోన్స్ కాకుండా చిరు వ్యాపారాల ఏర్పాటుకు తప్పనిసరిగా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
బ్యాంకర్లు వివిధ పథకాల కింద లబ్ధిదారులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలి..
ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకర్లు ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాల నిర్వహించాలి..
చేనేత కార్మికులకు పెండింగ్ లో ఉన్న మార్జిన్ మనీ వెంటనే విడుదల చేయాలి..
విద్యార్థులకు విద్యా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి…
ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ అధికారులు నిర్వహించే పొలం పిలుస్తుంది కార్యక్రమంలో బ్యాంకర్లు విధిగా పాల్గొనాలి…
భీమవరం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశంలో నందు బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లా స్థాయి సమీక్ష సమావేశం లీడ్ బ్యాంక్, ఆర్బిఐ, నాబార్డ్ ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకర్లతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ బ్యాంకర్లు సి సి ఆర్ సి కార్డ్స్, పీఎం స్వనిధి, విద్య, ఎస్ హెచ్ జి, ముద్ర, తదితర రుణాలను జాప్యం లేకుండా లబ్ధిదారులకు మంజూరు చేయాలన్నారు. నేత కార్మికులు 81 మందికి మంజూరు చేయాల్సిన మార్జిన్ మనీని వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం చేనేత కార్మికుల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు. పట్టణ ప్రాంతంలోని ఎస్ హెచ్ జి మహిళలకు గ్రూపు రుణాలతో పాటు, చిరు వ్యాపారాల స్థాపనకు అవసరమైన వ్యక్తిగత రుణాలను కూడా విరివిగా మంజూరు చేయాలన్నారు. కొన్ని బ్యాంకులు రుణాల లక్ష్యసాధన తక్కువగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. రుణాల మంజూరు విషయంలో పదేపదే సమావేశాల్లో చెబుతున్న బ్యాంకర్లు అనుకున్నంత చొరవ చూపడం లేదని, ఇటువంటి పరిస్థి రాబోయే సమావేశంలో కనిపించకూడదు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఎంతో చైతన్యవంతమైనదని, చదువుకునేవారిని కూడా ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన విద్యా రుణాలను మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలన్నారు. ప్రతి వారం మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉదయం, మధ్యాహ్నం రెండు గ్రామాలు చొప్పున పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అలా నాలుగు వారాలకు 16 గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు బ్యాంకర్లు కూడా పాల్గొని వ్యవసాయ అనుబంధ రుణాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. బ్యాంకర్లు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను తరచు నిర్వహించి పొదుపు చేయడం, తదితర అంశాలపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. 2025 – 26 వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి డిసెంబర్ 31 నాటికి స్వల్పకాలిక ప్రొడక్షన్ రుణాలు రూ.6,778.86 కోట్లు (80.53 శాతం), వ్యవసాయ టర్మ్ లోన్స్ రూ.6,476.66 కోట్లు (134.94 శాతం), అగ్రికల్చర్ ఇన్ఫ్రా & అగ్రికల్చర్ యాన్సిలరీ రూ.2,212.9 (120.34) కోట్లు మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15,057 కోట్లకు గాను రూ.15,468.9 కోట్ల రుణాలను మంజూరు చేసి 102.73 శాతం లక్ష్యసాధన జరిగిందన్నారు. అలాగే ఎమ్ఎస్ఎంఇ అడ్వాన్సులు, ఎక్స్ పోర్ట్ రుణాలు కింద రూ.15,468.45 కోట్లు మంజూరు చేసి 71.06 లక్ష సాధన జరిగిందన్నారు. ఎడ్యుకేషన్, హౌసింగ్, తదితర ప్రాధాన్యత రంగాలకు రూ.439.16 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, లక్ష్యసాధన తక్కువగా ఉండటంతో బ్యాంకర్లను సున్నితంగా మందలించారు. ప్రాధాన్నేతర రంగాలకు రూ.29,608 కోట్లు రుణాలు మంజూరు లక్ష్యం గాక రూ.28,939.17 కోట్లు మంజూరు చేసి 97.73 లక్ష్యసాధన చేయడం జరిగిందని తెలిపారు. 2025-26 సంవత్సరాలకు కౌలుదారులకు సిసిఆర్సి కార్డ్స్ జారీ లక్ష్యం 1,05,000 కాగా సెప్టెంబర్ 30 నాటికి 72,237 కార్డులను జారీ చేయడం జరిగిందని తెలిపారు. వీరిలో 25,470 మందిక కౌలుదారులకు రూ.225.17 కోట్లు రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ లు జారీ చేసిన వారిలో జనవరి నెలాఖరు నాటికి 2,124 మందికి రూ.7.58 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. పీఎం విశ్వకర్మ, పీఎం సూర్య ఘర్, అన్ క్లైమడ్ డిపాజిట్స్, పీఎం స్వనిది, హౌసింగ్, పీఎంఈజీపి తదితర పథకాలు అమలు పై సమీక్షించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాల మంజూరు లక్ష్యసాధనకు కృషి చేయాలి అన్నారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని, రుణాలు మంజూరు మాత్రం వేగవంతం చేయాలని సూచించారు.
చివరిగా నాబార్డ్ విడుదల చేసిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026-27 ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఏ.నాగేంద్ర ప్రసాద్, ఆర్బిఐ లైజాన్ ఆఫీసర్ ఏ.రామకృష్ణ, నాబార్డ్ డీడీఎం సి. నిశాంత్ చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
