ఎస్.సి, ఎస్.టి, బి.సి వర్గాలు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడి ఋణాలను సద్వినియోగం చేసుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావాలి..
ఎస్.సిల ఉపాధి అవకాశాలు మెరుగుదలకు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…
ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లను అమలు చేసి పేదల ఆర్థిక అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి
షెడ్యుల్డ్ కులాల జాతీయ కమీషన్ మెంబరు( న్యూఢిల్లీ) వడ్డేపల్లి రామచంద్రర్.
షెడ్యుల్డ్ కులాల జాతీయ కమీషన్ మెంబరు( న్యూఢిల్లీ) వడ్డేపల్లి రామచంద్రర్, షెడ్యూల్డ్. కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ (హైదరాబాద్) సునీల్ కుమార్ బాబు సంయుక్తంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లాలో వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి అమలు చేస్తున్న సబ్సిడీ బ్యాంకు ఋణాలు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై గృహ నిర్మా ణం, పరిశ్రమలు విద్య, వైద్య ఆరోగ్యం, రోడ్లు భవనాలు, పోలీస్, సాంఘిక సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖల వారీగా సమీక్షించారు.
ఈ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, అధ్యక్షత వహించగా, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు దాసిరాజు, ఖతిబ్ కౌసర్ భానో, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షెడ్యుల్డ్ కులాల జాతీయ కమీషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రర్ మాట్లాడుతూ ఎస్ సీ, ఎస్టీ, బీసీ, వర్గాల వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్స్ అనుగుణంగా నిబంధనల మేరకు సంక్షేమ, అభివృద్ది పథకాలు అమలకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద, బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. ప్రతి అధికారి పథకం లక్ష్యాలను అవగాహన చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కరు చట్టాన్ని గౌరవించాలని, చట్టానికి లోబడి విధులు నిర్వహించాలన్నారు. విధుల నిర్వహణలో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నిబద్ధకతో అధికార యంత్రాంగం పనిచేసి పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కమిషన్ తగు చర్యలు తీసుకోవడానికి వెనుకాడదన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అంగన్ వాడి కేంద్రాలలో చిన్నారులకు మంచి పోషకాహారం అందించాలన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీల, బాలింతల ఆరోగ్యం పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎస్సీ కులాలకు చెందిన వారి భూములను అన్యాక్రాంతం చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. యువత పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టేలా ప్రోత్సహించాలన్నారు. స్టాండ్ అప్ ఇండియా పథకాన్ని నిబంధల మేరకు అమలు చేయాలి. రూ.5 నుండి రూ.10 కోట్ల వరకు పూచీకత్తులు లేని సబ్సిడీ రుణాలను అందజేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా అడిషనల్ ఎస్పి వి.భీమారావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, ఆర్డీవోలు దాసి రాజు, ఖతీబ్ కౌసర్ భానో, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఎస్పిలు జయ సూర్య, విశ్వనాధ్, డా.శ్రీ వేద, ట్రైనీ డిఎస్పి కె.మానస, డిపిఓ ఎన్. రామ్నాథనాథ్ రెడ్డి, డ్వామా పిడి కేసిహెచ్ అప్పారావు, హౌసింగ్ పిడి జి.పిచ్చయ్య, ఎల్.డి.ఎం ఎ.నాగేంద్ర ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి రఘునాథ్ బాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగలింగాచారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీ కృష్ణ, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, డి ఎం ఎం హెచ్ వో జి గీతా బాయి, డీఈవో ఈ. నారాయణ, ఐసిడిఎస్ పిడి డి.లక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కెనరా బ్యాంకు, కోపరేటివ్, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.