ఎన్నికల పర్యవేక్షణకు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 21/10/2026
WhatsApp Image 2026-10-21 at 8.12.40 PM

ఎన్నికల పర్యవేక్షణకు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు భీమవరం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణి తెలిపారు.

ఎన్నికల ప్రక్రియపై పర్యవేక్షణ, సమన్వయం, సకాలంలో నివేదికల సమర్పణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌ను సంప్రదించేందుకు 08816299181 నంబరును అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

కంట్రోల్ రూమ్‌కు నియమితులైన సిబ్బంది తమ బాధ్యతలను శ్రద్ధగా నిర్వహిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.