ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లాకు కొత్తగా 3988 పింఛన్లు మంజూరు.
శుక్రవారం పాలకోడేరు మండలం గోరగనమూడి గ్రామంలో వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు స్థానిక జ్ఞానానంద సీనియర్ సిటిజన్స్ ఆశ్రమంలో 15 మందికి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, పిల్లల చదువులు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లబ్ధిదారుల ఇంటిలో మంచినీటి కుళాయి, కరెంటు సౌకర్యం, డ్రైనేజీ సదుపాయం ఉన్నది లేనిది పరిశీలించి ప్రభుత్వం తరఫున వారి కోరుకునే అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిండేలా వీరాస్వామి అనే యువకునకు ఐటిఐ మెకానికల్ విభాగంలో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలని, గండికోట దుర్గ అనే యువతకి కుట్టు మిషన్ ఇప్పించాలని డి ఆర్ డి ఏ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛను పథకం కింద జిల్లాలో ఈరోజు 2,26,995 మందికి పెన్షన్ల ఉదయం 6.00 గంటల నుండి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ ప్రారంభించడం జరిగిందని, ఈ పింఛన్ల కింద జిల్లాకు 97.14 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది అన్నారు . ముఖ్యంగా ఆగస్టు నెల నుండి ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ల కింద జిల్లాలో 3988 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం భాగస్వామి పెన్షన్లు మంజూరు పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు అన్నారు. ఒక్క గోరగనమూడి గ్రామంలో 290 మంది వివిధ పెన్షన్ దారులుకు రూ.12.13 లక్షలు అందజేస్తున్నమన్నారు. ఈసారి పెన్షన్ల పంపిణీతో పాటు సచివాలయ సిబ్బంది పి4ఫోర్ లో భాగంగా బంగారు కుటుంబాల అవసరాల గురించి కూడా సర్వే చేయడం జరుగుతోందన్నారు. పేద వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆశయ సాధనకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిపిఎం మురళీకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.వి.ఎస్ రాంప్రసాద్, వీఆర్వో కే.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి పి.సరళ, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.