ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు
శనివారం కాళ్ల మండలం పెద్ద ఆమిరం గ్రామంలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. ఈరోజు పెదఆమిరం గ్రామంలో కలెక్టర్ తో కలిసి పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి నెల ఒక జిల్లాలో పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా అమలవుతున్నాయి, తీసుకున్న రుణాలతో ఏ విధంగా యూనిట్లు నడుపుతున్నారు అని తెలుసుకోవడానికి గ్రామంలోని జేవీ క్లాత్ ఎంబ్రాయిడరీ యూనిట్ సందర్శించడం జరిగిందన్నారు. ఎలా నడుస్తున్నది, మార్కెటింగ్ ఏ విధంగా ఉంది అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు బయట అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుని వ్యాపారాలు చేసి నష్టపోతున్నారని, అలాంటి వారినందర్నీ ప్రభుత్వం ద్వారా బ్యాంకు రుణాలను కల్పించే ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ముందుగా పెద ఆమిరం గ్రామము నుండి మొదలుపెట్టి అమలు చేయడం జరుగుతుందని చెప్పారు.
గ్రామాల్లో రోడ్లు, పంట కాలువలు, డ్రైన్లు, ఆక్రమణలకు గురు అవుతున్నాయని, రోడ్లు ఆక్రమించుకోవడం వల్ల ట్రాఫిక్ పెరిగి అంతరాయం కలుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, తహాసిల్దారు సుందర్ సింగ్, ఎంపీడీవో తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.