ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి
శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని మిలటరీ కాలనీ, రూరల్ మండలం వెంకట రామన్నగూడెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సెక్రటరీ మరియు పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి గ్రామంలో పర్యటించి లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ ఈరోజు ఉదయం నుండి ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రశాంత వాతావరణంలో అర్హులైన వారందరికీ సిబ్బంది పింఛన్ పంపిణీ చేస్తున్నరన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో అర్హులైన వారికి ఒకరోజు ముందుగానే పింఛను అందజేయటం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 2,23,675 మంది లబ్ధిదారులకు రూ.96.73 కోట్ల ను 4,600 మంది సిబ్బందితో ఈరోజు ఉదయం 7 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని సాయంత్రం కల్లా పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. 1/12/2023, నుండి 31/10/2024 కాలంలో పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన భర్త పెన్షన్ పెండింగ్ ను భార్యకు ఇవ్వడం జరుగుతుందన్నారు .జిల్లాలో సుమారు మూడువేల మందికి ఈ నెల 12వ తేదీన పెన్షన్ బకాయిలను అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.1000 పింఛను పెంచి ఇస్తున్నదని, రెండవది దీపం-2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని, మూడవది తల్లికి వందనం పథకం త్వరలో అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడుపుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం తాడేపల్లిగూడెం మెయిన్ కెనాల్ లో కొనసాగుతున్న పూడికి తీత పనులను జిల్లా ప్రత్యేక అధికారితో కలిసి జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పరిశీలించారు.
తొలుత తాడేపల్లిగూడెం పట్నంలోని మిలిటరీ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఖతీబ్ కౌసర్ భానో, డి ఆర్ డి ఎ పిడి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, ఐసిడిఎస్ పిడి బి.సుజాతరాణి, కమిషనర్ ఎం. ఏసుబాబు, ఏపీఓ పి.మురళీకృష్ణ, తహాసిల్దార్ ఎం.సునీల్ కుమార్ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.