• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఎట్టి పరిస్థితుల్లో బాలలు పని ప్రదేశాల్లో కార్మికులుగా ఉండకూడదు-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 04/08/2025

కార్మిక చట్టాలు ఉపాధికి సంబంధించిన వివిధ అంశాల పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలి

మహిళా కార్మికుల హక్కులు మరియు శ్రేయస్సును కాపాడాలి

జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఇంచార్జి టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ రైడింగ్ డిస్టిక్ లెవెల్ కమిటీ సభ్యులు లేబర్, ఫిషరీస్, ఇండస్ట్రియల్, పొల్యూషన్, కంట్రోల్ బోర్డ్, ఎంపెడా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమానికి నిర్దేశించిన నిబంధనలను విధిగా పాటించాలన్నారు. ఫ్యాక్టరీల ప్రాంగణంలో మహిళా కార్మికులకు అనుకూలమైన సౌకర్యమంతమైన పని వాతావరణాన్ని కల్పించాలన్నారు. పని గంటలు, పని పరిస్థితులు మెరుగుగా ఉండాలన్నారు. వారికి కనీస వేతనం కల్పించాలని సూచించారు. ఆరోగ్య పరిశుభ్రత మరియు పిల్లల సంరక్షణ ప్రత్యేక అవసరాలు కల్పించాలన్నారు. మహిళలకు టాయిలెట్స్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్యాక్టరీలలో ఎక్కడ బాల కార్మికులు ఉండకూడదన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పని చేసే చోట పొల్యూషన్, వ్యర్ధ జలాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే ఆగస్టు 5వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు జిల్లాలో ప్రాన్ ప్రాసింగ్ యూనిట్స్ ను పరిశీలించి నివేదికను అందజేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, కమిటీ సభ్యులను ఆదేశించారు.

సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగలింగాచార్యులు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.స్వాతి, ఎంపెడా అధికారి గోపాల్ ఆనంద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎఫ్ఈఓ ఎన్.వెంకటరమణ,తదితరులు పాల్గొన్నారు.