Close

ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న కన్నతల్లిని, జన్మభూమిని మర్చిపోకూడదు..

Publish Date : 15/10/2025

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం స్కూల్లో ఓనమాలు నేర్చి నేడు కేరళ డీజీపీగా పనిచేస్తున్న…

నా తల్లిదండ్రులు, గురువులు మార్గదర్శకత్వం, స్నేహితులు ప్రేమ నన్ను ఉన్నతంగా నిలిపాయి అనడంలో సందేహం లేదు…

జీవితంలో అత్యున్నతమైనది “కృతజ్ఞత” …. దానగుణం ఔన్నత్యానికి, వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడతాయి..

విద్యార్థులు సోషల్ మీడియా మాయలో జీవితానికి అడ్డంకులు ఏర్పరచుకోవద్దు..

మాదకద్రవ్యాలు సవాలు నుండి మన చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉంది…

.. కేరళ రాష్ట్ర డిజిపి రావాడ ఆజాద్ చంద్రశేఖర్, ఐపిఎస్.,

పోలీసింగ్ అనేది నిరాడంబర అధికారిగా ఉండడమే కాకుండా, ప్రజల జీవితాలకు నమ్మకం కలిగించడం ఒక బాధ్యత అని కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో జన్మించి, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి రాష్ట్రస్థాయిలో ఒక అత్యున్నత పదవిలో పనిచేస్తున్న రావాడ ఆజాద్ చంద్రశేఖర్ కు వీరవాసరం గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బంధువులు, స్నేహితులు మధ్య మంగళవారం వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా సన్మాన కార్యక్రమంలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్పర్సన్ పీతల సుజాత, వీరవాసరం పాఠశాలలో చదువుకున్న ఉన్నత అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేరళ రాష్ట్ర డిజిపి రావాడ ఆజాద్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నేను ఇదే పాఠశాలలో చదువుకున్నానని, కేరళ రాష్ట్రం డీజిపి గా ఎదగడానికి ప్రధాన కారణం గురువులు, ఊరి ప్రజల ఆశీస్సులే కారణం అన్నారు. ఇదే ఊరిలో నాతో పాటు ఇంట్లో పూర్తి చేసుకున్న ఎం. సుబ్బారెడ్డి, చికిలే సుధాకర్, నేను ఆల్ ఇండియా సర్వీసులకు ఎంపిక రావడం, వివిధ రాష్ట్రాల్లో అత్యున్నత పదవులలో ఉండడం వీరవాసరం ఖ్యాతి దేశం మొత్తం తెలిసిందన్నారు. జీవితం అనేది శక్తి, సమయం యొక్క భవిష్యత్తు (Life is a future of time of energy) గా వర్ణించారు. ఆరోజును ఎలా వాడుకుందాం, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనేది ప్రధానంగా పెట్టుకోవాలన్నారు. ఏదైనా సాధించాలంటే ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, స్పిరిట్వల్ ఎనర్జీ అనేవి ప్రధానంగా ఉండాలని, ఉన్న సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. నేను సాధారణ విద్యార్థిని ఐపీఎస్ సాధించడంలో యోగ్యత, యోగం కూడా కలిసి ఉన్నాయన్నారు. యోగ్యత ఉంటే యోగం భగవంతుడు చూపిస్తాడని వ్యాఖ్యానించారు. మన పుట్టిన ప్రదేశానికి, చదువుకున్న ప్రాంతానికి, విద్య నేర్పిన గురువులకు, స్నేహితులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరిలో ఫర్ గివ్ నెస్ ఉండాలన్నారు. ఎప్పుడూ కూడా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది పోలిక ఉండకూడదని, అది ఔన్నత్యానికి ఉపయోగపడుతుందన్నారు. దానగుణం ఔన్నత్యానికి, వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. పొలం పనులు కూడా చేశానని, విద్యార్థులు గురువుల ఉపదేశాలలు, మార్గదర్శకంలో ఎంతో సాధించగలరన్నారు. ఈ సందర్భంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వీసును ఆనందిస్తూ, కష్టనష్టాలను అనుభవిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. పోలీసింగ్ అనేది సాధారణ అధికారిక ఉండటంతోపాటు, ప్రజల జీవితాల్లో నమ్మకం కలిగించడం ఒక బాధ్యత అన్నారు. కేరళ రాష్ట్రంలో పెద్ద ఛాలెంజింగ్ గా ఉన్న, ప్రజల పక్షాన కృషి చేశానని, కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. మనం చేసే పనిలో ఆత్మీయత, గొప్పతనం అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. ఇంటర్నెట్ కు పిల్లలు బానిసలు కాకూడదని, సరైన మార్గంలో వాడుకోవాలన్నారు. లేకపోతే జీవితంలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుందని, తల్లిదండ్రులు పిల్లలు దీని బారిన పడకుండా చూడాలన్న. ప్రస్తుత పరిస్థితులలో మాదకద్రవ్యాల వినియోగం ఒక సవాలుగా ఉందని పోలీస్ వ్యవస్థ ఎంత కట్టడి చేసిన, మన పిల్లలను కాపాడుకోవడానికి అదనంగా సామాజిక బాధ్యత అవసరం అన్నారు. స్ఫూర్తిదాయకంగా సాగిన ప్రసంగం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. చివరిగా జై వీరవాసరం.. జై ఆంధ్ర ప్రదేశ్.. జైహింద్ అంటూ ప్రసంగాన్ని ముగించారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేరళ డిజిపి గా రావాడ ఆజాద్ చంద్రశేఖర్ పశ్చిమగోదావరి జిల్లావాసి కావడం ఎంతో గర్వించదగిన విషయం అన్నారు. మన ప్రాంతం వారు కేరళ డీజీపీగా ఉండటం ఉమ్మడి, తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఎంతో అభినందించవలసిన విషయం అన్నారు. తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు పాత్ర ఎంతో విలువైనది అన్నారు.

భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పునపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ నా నియోజకవర్గంలోని వ్యక్తి ఒక రాష్ట్రానికి డిజిపిగా కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్జి వీరవల్లి గోపాలకృష్ణ, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్పర్సన్ పీతల సుజాత, పాఠశాల, కళాశాల పూర్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, స్థానిక పెద్దలు, నాయకులు, ప్రజలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.