• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఉల్లి రైతులను ఆదుకోవడానికి హోల్ సేల్ వ్యాపారస్తులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 01/09/2025

సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఉల్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి వ్యాపారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులను మానవతా దృక్పథంతో నష్టకాలంలో ఆదుకోవాలని తెలిపారు. సాధ్యమైనంత మంచి ధరకు రైతుల నుంచి ఉల్లిపాయలు కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత వ్యాపారులపై ఉందని అన్నారు. కర్నూలు, నంద్యాల ఉల్లిపాయలు అకాల వర్షాలు కారణంగా కొంత దెబ్బతిన్నాయని, స్థానిక హోల్ సేల్ వ్యాపారులు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలన్నారు. స్థానిక ప్రజలు సోలాపూర్, మహారాష్ట్ర ఉల్లిపాయలను ఎక్కువగా వాడటం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వీటిని కూడా వినియోగించాలని, అలాగే ప్రైవేటు కళాశాలల, పాఠశాలల హాస్టల్స్ వంటకాలలో వినియోగించేలా చూడాలన్నారు. జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, వసతి గృహాల్లో, ప్రభుత్వ పాఠశాలలో వినియోగించేందుకు సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది అన్నారు. ప్రస్తుతం ఉల్లి పంట కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులకు మనమందరం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ సందర్భంలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, మార్కెటింగ్ ఏడి కె.సునీల్ కుమార్, తహశీల్దార్ ఎం.సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.రామాంజనేయ రాజు, ఉల్లి మార్కెట్ హోల్ సేల్ వ్యాపారస్తులు, తదితరులు ఉన్నారు.