ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియ నూరు శాతంనమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 26/10/2026
WhatsApp Image 2026-10-26 at 4.53.36 PM

ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియ నూరు శాతంనమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

సోమవారం వశిష్ట సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియపై పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో వివిధ విద్యాసంస్థలకు చెందిన
ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల, పాఠశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తూర్పు- పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినందున అర్హులైన ప్రతి ఉపాధ్యాయ ఓటర్లు నమోదు ప్రక్రియ నూరు శాతం నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల కు తెలిపారు.
ఓటర్ల నమోదు కావాలనుకునే ఉపాధ్యాయులు ఫారం- 19 లో దరఖాస్తుతో పాటు 1-11-2026 తేదీ నాటికి గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల, కళాశాలల్లో టీచర్, లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు ధ్రువీకరిస్తూ సంబంధిత విద్యా సంస్థ అధిపతి నుండి ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలని తెలిపారు.

**నమోదు ప్రక్రియకు సంబంధించి
ఫామ్ -19తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వ పాఠశాల కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ, లెక్చరర్లు అనుబంధం -II పై సంబంధిత ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి, ప్రిన్సిపాల్ తో ధ్రువీకరించాలని తెలిపారు.

** ప్రైవేటు పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు అనుబంధం -II పై ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ ధ్రువీకరణతోపాటు డిఇఓ, ఆర్ ఐ ఓ, ఆర్ జె డి లతో కూడా తప్పనిసరిగా కౌంటర్ సంతకం చేయించాలని తెలిపారు.

**వీటితోపాటు అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు వివరాలను జత చేయాలని తెలిపారు.

** ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాల, కళాశాల, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో, కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్ ఐ ఓ, ఆర్ జె డీలచే అనుబంధం-II నందు తప్పనిసరిగా కౌంటర్ సంతకం చేయించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.

**తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం నందు ఓటరుగా నమోదు కు 6.11.2026 తేదీ చివరి నాటికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఓ వి ఎస్ అనిల్ కుమార్, వివిధ విద్యా శాఖల కళాశాలలు, పాఠశాలల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
…………….