Close

ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరుపట్టిని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 28/06/2025

పట్టణంలో ఏ ఆర్ కె ఆర్ మున్సిపల్ హై స్కూల్ ఆకస్మిక తనిఖీ

మధ్యాహ్న భోజన పథకం మెనూ వివరాలపై ఆరా

విద్యార్థులు వినియోగించే టాయిలెట్ పరిశీలన

భీమవరం పట్టణం నాలుగువ వార్డులో ఉన్న అల్లూరి రామకృష్ణ రాజు మున్సిపల్ హై స్కూల్ (ఏ ఆర్ కె ఆర్) శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు వండి పెట్టే కిచెన్ రూమ్ ను, పరిసరాలను పరిశీలించారు. రాగి జావా తయారు ఎలా చేస్తున్నారు, ఈరోజు మెనూ ఏమిటి మెనూ ప్రకారం అన్ని కరెక్ట్ గా చేస్తున్నారా రైసు సరైన పరిమాణంలో కొలిచి వేస్తున్నారా వెయిటింగ్ మిషన్లు, ఉపయోగిస్తున్నారా అని పలు ఆరాలు తీశారు. పిల్లలకు పెట్టే ఆహారంలో ఎటువంటి అవకతవకులు జరిగిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కిచెన్ రూమ్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలని, కీటకాలు ఏమీ రాకుండా కిటికీలకు మెస్ వేయించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడపడితే అక్కడ కోడిగుడ్లు అట్టలు, అట్టపెట్టెలు, చెత్త పారవేయకుండా ఒకచోట ఉంచాలని స్కూలు ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. టాయిలెట్ రూములను పరిశీలించి వాటిలో పైపులు పగిలి ఉండటం నీళ్లు సరిగా రాకపోవడం గమనించి వెంటనే రిపేరు చేయించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు పట్టిని పరిశీలించారు. 6 మంది ఉపాధ్యాయులు రాకపోవడం గమనించి ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులను వివరణ అడుగుగా సెలవు పెట్టారని ఆన్నారు. ఆరుగురు ఒకేసారి సెలవుకు కారణాలు తెలపాలని అన్నారు. విద్యార్థులు కూడా ఎక్కువగా ఆఫ్ సెంట్ ఉండటానికి కారణాలను చెప్పాలని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్ కి వెళ్లి పిల్లలతో మాట్లాడారు ఎలా చదువుతున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెప్పు చున్నారా అని ఆరా తీశారు. కొద్దిసేపు పిల్లలతో ముచ్చటించారు. కిరణజన్య సంయోగా క్రియ సైన్స్ పాటమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, విద్యార్థులకు స్వయంగా బోధించారు. విద్యార్థులు ఇష్టముగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు.
స్కూలు ఆవరణ అంతా క్లీన్ & గ్రీన్ గా ఉండాలని ఎక్కడ ఎటువంటి చెత్త లేకుండా ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్ది, ఫోటోలు తీసి రిపోర్ట్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులను, సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంలో డిప్యూటీ డీఈవో ఎం.రమేష్, ఎంఈఓ-1 ఎన్.శ్రీనివాసరావు, ఎంఈఓ -2 వేండ్ర వెంకటేశ్వరరావు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాము, తహసిల్దార్ రావి రాంబాబు, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.