ఉండి నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధిలో ముందంజలో నిలిచి రాష్ట్రానికి దిక్సూచిగా నిలవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు
రతన్ టాటా మార్గ్ పెదఅమిరం గ్రామ పరిధిలో కాళ్ల మండలం పెదమిరం ఉండి ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో రూ.1.50 కోట్లతో విస్తరించే నాలుగు లైన్ల రహదారి పనులకు సోమవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు ఉంటే విద్య, వైద్యం, వ్యవసాయ, వాణిజ్య రంగాలకు వేగవంతమైన రవాణా సౌకర్యం కలుగుతుందని అన్నారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా స్థానిక ప్రజలకు చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అభివృద్ధిలో అన్ని రంగాలలో ఉండి నియోజకవర్గం రాష్ట్రంలో, జిల్లాలో దిక్సూచిగా నిలవాలనే లక్ష్యంతో భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కృషిచేసి భాగస్వాములు కావాలన్నారు. రైల్వే గేటు నుండి రతన్ టాటా విగ్రహం వరకు ఉన్న డబల్ రోడ్డును 4 లైన్లల రోడ్డుగా విస్తరింపచేసి, మేజర్ రింగ్ రోడ్డు భీమవరం రోడ్డుకి చేర్చడం జరుగుతుందన్నారు. మరో లింక్ రోడ్డు వివేకానంద మార్గ్ వరకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో వాకింగ్ కి వీలుగా ఉండేలా డిజైన్ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో జిల్లాలోని ప్రతి పట్టణంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. అభివృద్ధి కొరకు కొన్ని ఆక్రమణలు తొలగించవలసినప్పుడు ప్రజలు ఆందోళన పడకుండా మంచి మనసుతో సహకరించాలని ప్రజల సంక్షేమం కోసమే అని తెలుసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు సూచించారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధి ద్వారా జిల్లాలో పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఇంచార్జ్ ఎస్ఇ ఏ.శ్రీనివాస్, జెఇ కె.శ్రీహరి, సర్పంచ్ డి.సోమేశ్వరరావు, రాజు, గాదిరాజు సుబ్బరాజు, చిలుకూరి బోసు రాజు, రైతులు, తదితరులు ఉన్నారు.