ఈ పంట నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
రైతులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా ఈ పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో యాప్ ద్వారా డోన్ ఫోటో తీసి ఈ పంట చేయు విధానమును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పంట నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా పారదర్శకంగా జరిగేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. డోన్ ద్వారా చేయటం వలన ఎక్కువగా ఈ పంట నమోదు చేయడంతో పాటు సమయం ఆదా అవుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల పొలాల్లోకి వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంటను పరిశీలించి రైతులతో స్వయంగా మాట్లాడారు. ఈ పంటను యాప్ లో నందు నమోదు పక్రియను జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతు తో ఫోటో తీసి పరిశీలించారు. పంట వివరాలు నమోదు, ప్రతి రైతులు యొక్క అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు . పంట విస్తీర్ణం పంట రకం సాగు పరిస్థితులు సరిగ్గా నమోదు కావాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పంట నమోదు సరిగ్గా జరిగితేనే రైతులకు ప్రభుత్వ పథకాలు లబ్ధి అందుతుందని, పంట నష్టపరిహారం బీమా మద్దతు ధర వంటి ప్రయోజనాలు సకాలంలో అందుతాయని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అందువల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యవసాయ రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతి రైతు వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. రైతులు తమ పంట వివరాలు సరిగ్గా నమోదు అవుతున్నాయా లేదా అని పరిశీలించుకోవాలని అన్నారు. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పంట నమోదు కార్యక్రమం కీలకమైన భాగం అని. రైతులందరూ పంట నమోదు సమయంలో సహకరించి సరైన వివరాలను అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు .
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్.వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి బి.సంధ్య, గ్రామ కార్యదర్శి, ఆర్ఐ, విఆర్ఓ, రైతులు, తదితరులు ఉన్నారు.
