• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఈ-పంట డిజిటల్ క్రాఫ్ నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 13/08/2025

ఈ-పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి

ప్రతి రైతు ఈ-పంటలో నమోదు కావాలి

 

గణపవరం మండలం కేశవరం గ్రామంలో బుధవారం ఖరీఫ్ 2025 ఈ-పంట డిజిటల్ క్రాఫ్ బుకింగ్ నమోదును కార్యక్రమమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ-పంట నమోదు ఎలా చేస్తున్నారు. రైతులు సహకరిస్తున్నారా అని ఆరా తీశారు. సర్వే నెంబర్లు ఉన్న పొలాలకు 20 మీటర్లు దగ్గర్లోకి వెళితే గాని ఈ పంట నమోదు అవ్వడం లేదని వ్యవసాయశాఖ సిబ్బంది జాయింట్ కలెక్టర్ కి వివరించారు. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈ పంట నమోదును వేగవంతముగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పంట నమోదులో ఎటువంటి తప్పులు లేకుండా కచ్చితంగా ఉండాలన్నారు.
పంట సాగు వివరాలుతో పాటుగా ఈ పంట క్వాలిటీతో కూడిన ఫోటోలను తీయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడారు ప్రభుత్వం అన్నదాతలకు అన్ని రకాలుగా ఆదుకోవటానికి చర్యలు తీసుకోవడం జరిగిందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీమా సౌకర్యాలు పొందాలంటే ప్రతి ఒక్క రైతు సమీపంలోని రైతు సేవా కేంద్రమునకు వెళ్లి ఈ పంట నమోదును చేసుకోవాలని అన్నారు. రైతులు పంట పొలాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయుటకు అధికారులకు సహకరించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎక్కువగా ఏ రకాలు పంటలు సాగు చేస్తున్నారు .పెట్టుబడి ఎలా అవుతుంది ఎరువుల లభ్యత ఎలా ఉంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత తరుణంలో మనకు ఉపయోగపడే వరి పంటలను రైతులు సాగు చేయాలని తద్వారా గిట్టుబాటు ధరతో పాటు రైతులు కు లాభసాటిగా ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు.

ఈ సందర్భంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ ఎస్ ప్రసాద్, ఆర్ ఎస్కే లు స్వరూప, కుసుమాకరు, సంజీవ్, వీఆర్వో, రైతులు, దండు గజపతిరాజు, యాళ్లపెద్దిరాజు, దండు రామచంద్ర రాజు, తదితరులు ఉన్నారు.