Close

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 07/03/2026

భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి శనివారం సాధారణ తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ప్రతి మూడు నెలలకి ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు. ఈవీఎం గోడౌను వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఈ సందర్భంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఎలక్షన్ సెక్షన్ ఇంచార్జి సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, తెలుగుదేశం పార్టీ తరఫున మరపట్ల శ్యామ్, జనసేన పార్టీ తరఫున బి.జయశివ, బహుజన సమాజ్ వాది పార్టీ తరపున కరుణాకర్, బిజెపి పార్టీ తరఫున కోమటి రవికుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.