ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం పిపి రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్ కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ప్రతి నెలలో ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ తనిఖీలో జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, ఎలక్షన్ సెక్షన్ ఇన్చార్జి సూపరింటెండెంట్ హాచ్ ఎన్ సి శేఖర్, సంబంధిత సిబ్బంది ఉన్నారు.