• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఈనెల 10న జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో “మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్” *పండుగలా నిర్వహించాలి

Publish Date : 06/07/2025

మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలి

ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం చేపట్టాలి

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీ ద్వారా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డి ఆర్ ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అటవీ శాఖ అధికారి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ప్రైవేట్ పాఠశాలల, జూనియర్ కళాశాలల అసోసియేషన్స్ ప్రతినిధులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 10వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహణకు పండుగ వాతావరణంలో, ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మెంబర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాలల పూర్వ విద్యార్థులు, ప్రముఖులను ఆహ్వానించి వారందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా కొత్త స్కూల్ యూనిఫామ్ ధరించి విధిగా హాజరయ్యాలా చూడాలని ఆదేశించారు. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థులు చేత వారి తల్లులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించాలన్నారు. తల్లిని పూజించడం ద్వారా సమాజంలో ఇతర స్త్రీలను కూడా గౌరవించే సంస్కారం వారికి అలబడుతుందన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి చేత అమ్మ పేరుతో ఒక మొక్కను నాటించే ఏర్పాటు చేయాలని. ప్రతి పాఠశాలకు మొక్కలను సరఫరా చేసే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయాలని ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు హోలీ స్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందించి విద్యార్థుల చదువుకు సంబంధించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల, జూనియర్ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి సంబంధించి జరిగిన ఏర్పాట్లపై సంబంధిత ఫోటోలు, వీడియోలు ఈనెల 8 తేదీ నుండి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రతి పాఠశాల, కళాశాలలో చేపట్టుచున్నందున అవసరమైన పోలీసు బందోబస్తుకు ఆదేశాలు ఇవ్వవలసినదిగా జిల్లా ఎస్పీకి సూచించారు. మెగా పిటిఏం కంటే ముందుగా పిల్లల ఆరోగ్య సమాచారాన్ని ముందుగానే పరీక్ష చేసి నమోదు చేయాలని, అలాగే పాఠశాలు, కళాశాలల వద్ద అవసరం మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డి ఎం అండ్ హెచ్ ఓ ని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నెంబరు 8816299181 ఫోన్ చేసి సంప్రదించాలని అన్నారు. ఈ మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేసి జిల్లాను, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా అందరూ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను కోరారు.

ఈ గూగుల్ మీట్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం ఆర్డీవోలు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంఈఓలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, జూనియర్ కళాశాలల అసోసియేషన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.