Close

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ నిరుద్యోగ యువతీ, యువకులకు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన వారు ఉద్యోగాలలో స్థిరపడి మంచిగా జీవనం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 25/06/2025

భీమవరం ఆర్ ఆర్ డి ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (Apssdc) మరియు నేషనల్ కెరియర్ సర్వీస్ (NCS) ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులకు నిర్వహించిన మెగా ఉద్యోగ మేళ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూత్ ఫర్ జాబ్ ఫౌండేషన్, రెడ్డి ఫౌండేషన్ వారు ఈ ఉద్యోగ మేళాలో అర్హతల మేరకు యువతీ యువకులను ఎంపిక చేసి రెండు నెలలు పాటు శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ నియామకాలు చేపడతారన్నారు. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వికలాంగ యువతీ, యువకులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించడం చాలా గొప్ప విషయం అన్నారు. ముందుగా ఈ జాబ్ మేళాకు హాజరైన యువతీ, యువకుల పేర్లు, వారి విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాలు సాధించి తాము కూడా సమాజానికి సేవ చేస్తున్నామనే భావం వారికి కలుగుతుందన్నారు. దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ ఉద్యోగ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నయి అన్నారు. ఈరోజు నిర్వహించిన ఉద్యోగ మేళాకు మొత్తం 65 మంది నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు అని, వారిలో 45 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డాక్టర్ పి.లోకమాన్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి వివరించారు.

కార్యక్రమంలో నైపుణ్య అభివృద్ధి అధికారి పి.లోకమాన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వికెజీ ప్రసున్న, NCSYP YP ఎం.కిషోర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ రమణరాజు, హెచ్ ఆర్ లు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.