Close

అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలి–జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.

Publish Date : 29/08/2025

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవ్ ..

జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా పరిష్కారం చూపాలి.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై సిఎంఓ 1100 కు అందిన ఫీడ్ బ్యాక్ నివేదిక అనుసరించి వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా అధికారులతో మౌఖికంగానూ, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో వెబ్ ఎక్స్ ద్వారా శాఖల వారి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సీఎంఓ 1100 కు అందిన సమాచారం మేరకు పిజిఆర్ఎస్ ఫిర్యాదుదారులు సమస్యల పరిష్కారంపై వారి స్పందన సంతృప్తికరంగా లేకపోవడం వల్ల రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంకు దిగువ స్థాయిలో ఉండటం పట్ల జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

. ప్రతివారం పీజిఆర్ఎస్ లో అందిన ఫిర్యాదుల పరిష్కారం పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పురోగతి సాధించలేకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పిజిఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. మండల స్థాయి అధికారుల సమన్వయంతో ఫిర్యాదుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అన్నారు. జిల్లా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదాలను కలిసి వారు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా పౌరసరఫరాలు, జిల్లా గృహ నిర్మాణం, విద్యుత్ శాఖలకు సంబంధించిన పీజీ ఆర్ఎస్ ఫిర్యాదుదారులతో ఫోన్లో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డి ఆర్ డి ఎ పీ.డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిపిఓ ఎన్.రామ్నాథ్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, జిల్లా పరిశ్రమల అధికారి యు.మంగపతి రావు, డి ఎం అండ్ హెచ్ ఒ జి.గీతాబాయి, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, డీఎస్ఓ ఎస్.సరోజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.