అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

అర్జీల పరిష్కార తీరు పారదర్శకత, నాణ్యతతో ఉండాలి
ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా పరిష్కారం చూపాలి
సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ గ్రామ, వార్డు సచివాలయ అధికారి, వై.దొసిరెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 191 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కొక్క సందర్భంలో ఫిర్యాదులు పరిష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో అధికారులు మాట్లాడాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈరోజు పీజీఆర్ఎస్ కి అందిన దరఖాస్తులలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
@ కాళ్ళ మండలం బొండాడ పేటకు చెందిన అరిటాకుల లక్ష్మి అర్జీని సమర్పిస్తూ, తనకు ఇద్దరు కుమారులని పెద్ద కుమారుడు భోగరాజు తన భార్య మాట విని నా ఇంటిని కోడలు పేరున బలవంతంగా సంతకాలు పెట్టించుకుని రాయించుకొని ఇంటి నుండి గెంటేశాడని, తనకు ఎటువంటి ఆధారం లేదని తన కొడుకుపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని కోరారు.
@ పోడూరు మండలం వద్దిపర్రు శివారు చింతలగరువుకు చెందిన తానేటి శ్రీనివాసరావు అర్జీని సమర్పిస్తూ, తాను వికలాంగు పెన్షన్ పై ఆధారపడి జీవిస్తున్నానని, అనారోగ్యం దృష్ట్యా జీవనం దుర్భరంగా ఉందని తనకు వికలాంగ పెన్షన్ 15 వేల రూపాయలు పించెను మంజూరు చేయాలని కోరారు.
@ పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన కోరాడ గణేష్ నాగ శివకుమార్ అర్జీని సమర్పిస్తూ తనకు చెవులు పనిచేయడం లేదని సదరం సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేస్తే పొరపాటుగా వెన్నెముక అని సదరం సర్టిఫికెట్ ఇచ్చారని దానిని రద్దు చేయాలని కోరారు.
@ భీమవరం 17వ వార్డుకు చెందిన గాడి సూర్యకుమారి తన భర్త 2013లో చనిపోయారని ఇప్పటివరకు వితంతు పింఛను మంజూరు కాలేదని దయచేసి వితంతు పైన్షన్ మంజూరు కొరకు అర్జీ సమర్పించారు.
@ పెనుగొండకు చెందిన శ్రీకాకుళం శక్తిరాజు తాను వికలాంగుడిని, అవయవాలు సక్రమంగా పనిచేయడం లేదని, దయచేసి నాకు వికలాంగ పింఛన్, త్రీ వీలర్ సైకిల్ ఇప్పించాలని కోరారు.
అనంతరం జిల్లాలో వాట్సాప్ గవర్నెన్స్ అమలు తీరుపై అధికారులతో సమీక్షించారు. సచివాలయ స్థాయిలో వాట్సాప్ గవర్నెన్స్ ఏ విధంగా అమలవుతున్నది అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 26 శాఖలకు సంబంధించి 530 సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వాట్సప్ గవర్నెన్స్ సేవలు వినియోగంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో వయోవృద్ధుల ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.