Close

అర్జీదారుల ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోపుగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 29/12/2025

పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీ దారిలో వద్ద అర్జీలను స్వీకరించారు. ఈసందర్బంగా వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలనుంచి 221 అర్జీలను అందుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజల నుంచి అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువు లోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. తమ శాఖ పరిధిలో లేని ఫిర్యాదులు వస్తే వాటిని తక్షణమే సంబంధిత శాఖ అధికారులకు పంపించాలన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా సమస్యల పరిష్కారం ఉండాలన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు.

ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని పిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి.

@ పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామానికి చెందిన కొరవటి వేణు అర్జీని సమర్పిస్తూ, తాను ఒంటరి మహిళలనని, ఏవిధమైన సంపాదనలేదని, అనారోగ్యముతో బాధపడుతున్నానన్నారు. ఇటీవల కంటి చూపు కూడా మందగించిందని బతకడం కష్టంగా ఉందని తనకు పించను మంజూరు చేయాలని కోరారు.

@ మడుగు పోలవరానికి చెందిన బి.పద్మ వేలు అర్జీని సమర్పిస్తూ తన భర్త గత సంవత్సర కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారని, వైద్య చికిత్స, జీవనోపాధికి చాలా ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

@ పాలకొల్లు మండలం, అరట్లకట్ల గ్రామానికి చెందిన రుద్రరాజు శ్రీనివాసరాజు అర్జీ సమర్పిస్తూ, అరట్లకట్ట గ్రామంలో తనకు 61 సెంట్లు భూమి ఉందని, పట్టాదార్ పాస్ పుస్తకంలో నమోదై ఉందన్నారు. ఇటీవల సబ్ డివిజన్ చేయించగా దానిలో 52.5 సెంట్లు మాత్రమే ఉందని, 3.5 సెంట్లు భూమి తక్కువగా ఉందని, సంబంధిత సమస్య పరిష్కారానికి అధికారులు స్పందించడం లేదని,దయచేసి తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.

@ మొగల్తూరు మండలం కాళీపట్నానికి చెందిన తంగేళ్ల వెంకట శివ నాగరాజు తనకు రెండు కళ్ళు కనిపించవని, నూరు శాతం సదరన్ సర్టిఫికెట్ ఉందని, వికలాంగ ఫించను మంజూరు చేయాలని అర్జీని సమర్పించారు.

@ ఉండి మండలం కోలమూరుకు చెందిన ఇంటి దివ్య ఆర్జీని సమర్పిస్తూ, తన కుమారుడు దివ్యంగుడని ప్రస్తుతం 6 వేల రూపాయల పెన్షన్ వస్తుందని, వైద్యానికి, పోషణకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, దయచేసి 15వేల రూపాయలు పించను మంజూరు చేయాలని కోరారు.

@ భీమవరంకు చెందిన బండారు సుబ్బారావు తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

జనవరి 3, 4 తేదీలలో గోదావరి క్రీడోత్సవాల జిల్లాస్థాయి క్రీడల పోటీలు నిర్వహణ.. జిల్లా కలెక్టర్.

గోదావరి క్రీడోత్సవాలలో భాగంగా డివిజినల్ స్థాయిలో జరిగిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారు జిల్లాస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనవలసి ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా అధికారులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విభాగంలో తప్పనిసరిగా పాల్గొనాలని కో

ఈ సమావేశంలో వివిధ శాఖ జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.