Close

అమర జీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 17/03/2025

ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మరియు ఆర్యవైశ్యుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవంలో పాల్గొని భీమవరం శ్రీ మావుళ్ళమ్మ గుడి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అమర జీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని అన్నారు. ఆయన అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రాణాలను కూడా పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఎప్పటికీ అనుసరణీయం మన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస హరిజనోద్దరణకు ఆయన జీవితాంతం కృషి చేశారని అన్నారు. 56 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించి సాధించిన త్యాగ ఫలితమే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.

ఆంధ్రుల జాతిపిత శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రులు ఉన్నంతకాలం చిరస్మరణీయులనీ, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసిన ఆయన దృఢ సంకల్పం, త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని శాసన సభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు తన ప్రాణాలను అర్పించిన అమరడు శ్రీ పొట్టి శ్రీరాములు అని అన్నారు . ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన త్యాగశీలి చిరస్మరణీయుడిగా తెలుగు జాతి ఆరాధ్య దైవముగా నిలిచి ఉంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి.గణపతిరావు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తాహసిల్దార్ రావి రాంబాబు, ఏ ఎస్ డబ్ల్యూ కె.వెంకటేశ్వర్లు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, వివిధ ఆర్య వైశ్య సంఘాల అధ్యక్షులు, వబిలి శెట్టి వెంకటేశ్వరరావు, ఓలేటి శ్రీనివాస్, కంచర్ల వెంకట రమణారావు, ఐ టి పొట్లూరి గోవెంకట కృష్ణారావు, వి.వెంకటేశ్వరరావు. పి.శ్రీనివాస్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.