• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

Publish Date : 02/08/2025

రైతాంగానికి అందించే పెట్టుబడి సాయం రైతులకు ఆర్థిక భద్రత, భరోసా ఇస్తుంది.

అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 1,03,751 మంది రైతులకు రూ.71.14 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ.

.. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.

శనివారం ఉండి మండలం, ఎన్.ఆర్.పి అగ్రహారం ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించి ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలిచారన్నారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 3,174 కోట్ల రూపాయలు జమ చేస్తుండగా, దీనిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 831 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 2,342 కోట్ల రూపాయలు అందించడం జరుగుతోందన్నారు.
అలాగే జిల్లాలో 1,03,751 మంది రైతులకు మొత్తం రూ.70.14 కోట్ల రూపాయలు జమ చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 18.24 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 51.88 కోట్ల రూపాయలు కలిపి అందజేయడం జరుగుతుందన్నారు.
. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి తొలి విడతగా నేడు 7,000 రూపాయలు, అక్టోబర్ మాసంలో రెండో విడతగా 7,000 రూపాయలు, జనవరి,26న 3వ విడతగా 6,000, మొత్తం సంవత్సరానికి 20,000 రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎరువులు, పురుగుమందులపై సబ్సిడీ ఇస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని ఒక పథకం కూడా అయన పేరు మీద లేదన్నారు. వ్యవసాయ రంగానికి బీమా పథకం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాయన్నారు. మరెన్నో సంక్షేమ పథకాలతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 1,03,751 మంది రైతులకు రూ.71.14 కోట్లు రూపాయలు నమూనా చెక్కును కేంద్ర మంత్రి రైతులకు అందజేశారు.

రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందని, రైతాంగానికి ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. రైతాంగం వ్యవసాయంతో పాటు చిరుధాన్యాల సాగుపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఉత్పత్తులను పండించేందుకు కొత్త ఆలోచనలతో రైతులు ముందుకు రావాలన్నారు. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద జిల్లావ్యాప్తంగా 1,03,751 మంది రైతులకు రూ.71.14 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం నేరుగా ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు జమచేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద ఉండి నియోజకవర్గంలో 9,629 మంది అర్హులైన రైతులకు 6,50,45,000 కోట్ల రూపాయల నమూనా చెక్కును ఆయన రైతులకు అందజేశారు.

ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యవసాయ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని, ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నది అన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేందుకు డ్రోన్లు, పవర్ టెల్లర్లు సబ్సిడీపై అందజేస్తున్నామన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతులు, కొత్త ఆలోచనలు జోడించి వ్యవసాయ ఉత్పత్తుల పెంచడానికి ముందుకు రావాలన్నారు. రైతులకు తొలి విడత పెట్టుబడి సాయం నేరుగా ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నది అన్నారు. దీనికి సంబంధించి రైతులకు ఏమైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే 15521 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశం యొక్క ఆర్థిక మూలాలన్నీ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. కరోనా సమయంలో అన్ని రంగాలు నష్టపోయినప్పటికీ ఒక్క వ్యవసాయ రంగం మాత్రం ఎగువకు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. ఇటువంటి వ్యవసాయరంగాన్ని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ రైతన్నలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతి తక్కువ ఖర్చుతో వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ వ్యవసాయ భూమి యొక్క సారాన్ని పెంచుతూ వ్యవసాయ భూమికి అనుకూలమైన పంటలను గుర్తించి, పండించిన పంటలను మద్దతు ధర పెంచడం జరుగుతుందని ఆయన అన్నారు.

రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడటం జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేయటం జరుగుతుందని అన్నారు. 4 వేల రూపాయలు పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్, అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు.

ముందుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల అవగాహన నిమిత్తం ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనను కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు, ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏడి ఏ.కె.ప్రతాప్ జీవన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ హటారి జె.వి ప్రసాద్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ మార్టేరు సహదేవరెడ్డి, కె వి కె ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎన్.మల్లికార్జునరావు,
తాహసిల్దార్, నాగార్జున, ఎంఏఓ నిమ్మల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సురవరపు కనకదుర్గ, ఎంపీటీసీ కె.రమాదేవి, స్థానిక ప్రజా ప్రతినిధులు జుత్తిగ నాగరాజు, ఎం.గాదిరాజు వెంకటేశ్వరరాజు, హరిమిరప నాగరాజు, పేరిచర్ల సుభాష్, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

111 112