అక్టోబర్ 14 నుండి ఘనంగా ప్రారంభమైన భీమవరం సూపర్ జిఎస్టి బెనిఫిట్ బజార్

ప్రదర్శనను తిలకించిన రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
జువ్వలపాలెం రోడ్ లోని కాస్మాపాలిటన్ క్లబ్ నందు భీమవరం సూపర్ జిఎస్టి బెనిఫిట్ బజార్ అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది.
అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తున్న జీఎస్టీ ఫలాల ప్రచారాన్ని జన బహుళ్యoలోనికి విస్తృతంగా తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు
జువ్వలపాలెం రోడ్డులోని కాస్మోపాలిటన్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన భీమవరం సూపర్ జిఎస్టి బెనిఫిట్ బజార్ ను రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అన్ని షాపులలో ప్రదర్శించిన వస్తువులను పరిశీలించి జీఎస్టీ తగ్గింపు పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల మోటర్ బైక్ ల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టి ప్రయోజనాలను అనేక విధాలుగా కలుగ చేయడం జరిగిందన్నారు. బెనిఫిట్ బజార్ నందు ప్రదర్శన, అమ్మకం ఐదు రోజులపాటు కొనసాగుతాయని, నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుంటూనే అవగాహన కూడా ఏర్పరచుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ యంత్ర పరికరాలపై పెద్ద మొత్తంలో జిఎస్టి తగ్గిందని, దీనిపై అవగాహన కలిగించడానికి రైతులను జిఎస్టి బజార్ తీసుకువచ్చి అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా సంఘాల అత్పత్తులు, చేనేత పరిశ్రమల ఉత్పత్తులు వినియోగించేలా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిఎస్టి తగ్గింపుతో వచ్చిన ఆర్థిక లాభంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని రంగాల్లో జీఎస్టీ స్లాబ్ లను పెద్ద మొత్తంలో తగ్గించడం జరిగిందని, ఈ విషయం ప్రజల్లోనికి తీసుకెళ్లడానికి గ్రామ గ్రామాన ఇంటింటా ప్రచారాన్ని చేయడం జరిగింది అన్నారు. నేడు ప్రారంభించిన భీమవరం సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజారు కాస్మోపాలిటన్ క్లబ్ నందు అక్టోబర్ 19 వరకు కొనసాగుతుందన్నారు. అన్ని రకాల వస్తువులను ప్రదర్శించడం జరుగుతుందని, అమ్మకాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రజలు, అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బెన్ఫిట్ బజార్ను సందర్శించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జీఎస్టీ నోడల్ అధికారి టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు మూడు వారాలుగా వివిధ కేటగిరిలలో జిఎస్టి తగ్గింపు ప్రచారాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. నాలుగో వారం అన్ని ప్రొడక్షను ఒకే ప్రాంతంలో ఉంచి అవగాహనతో పాటు అమ్మకాలనీ కూడా చేపట్టడం జరిగిందని, దీనినే సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అక్టోబర్ 19న కాస్మోపాలిటన్ క్లబ్ లోనే దియా ఫెస్టివల్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
భీమవరం బెనిఫిట్ బజార్ లోగోను రాజ్యసభ సభ్యులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ టి.సుశీల, భీమవరం ఆర్టీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డి, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి అప్పారావు, డి ఆర్ డి ఏ పిడి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, ఎల్ డి ఎం ఏ.నాగేంద్ర ప్రసాద్, తహసిల్దార్ రావి రాంబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు, షాపుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.