Close

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలి.

Publish Date : 20/06/2025

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న యోగ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీవోలు, తహాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న యోగా కార్యక్రమాల నిర్వహణకు మండల ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని సంబంధిత అధికారులు మండల స్థాయి అధికారుల సమన్వయంతో పనిచేసి 21వ తేదీన 4,835 లొకేషన్స్ లో జరిగే యోగా కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. యోగాబ్యాసనకు రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరిని యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూడాలన్నారు. సంబంధిత మండల స్థాయి అధికారులను సచివాలయ కేంద్రాలకు పంపించి గుర్తించిన లొకేషన్ లో 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు తప్పనిసరిగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించి సంబంధిత వీడియో, ఫోటోలను అప్లోడ్ చేయాలన్నారు. యోగా కార్యక్రమ నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు రేపు యోగా కార్యక్రమం నిర్వహణపై అధికారులందరూ దృష్టి పెట్టాలన్నారు.

జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్లో జూన్ 21న నిర్వహించే యోగా కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష.

జూన్ 21న జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్లో 5 వేల మందితో నిర్వహించే యోగా కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థినీ, విద్యార్థులు హాజరుపై సంబంధిత అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో కలెక్టర్ సమీక్షించారు. శనివారం నిర్వహించే యోగా కార్యక్రమానికి హాజరయ్యే కళాశాలల, పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు తప్పనిసరిగా వైట్ టీ షర్ట్ గాని లేదా లైట్ కలర్ డ్రెస్ కానీ ధరించి రావాలన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు విద్యార్థిని, విద్యార్థులు హాజరయ్యే విధంగా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. యోగాంధ్ర యాప్ లో రిజిస్టర్ చేసుకున్న యోగ అభ్యాసకులు తప్పనిసరిగా ఈ యోగా కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఎ.అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, జిల్లా పరిశ్రమల శాఖాధికారి యు. మంగపతి రావు, ఆర్టీవో బి. ఉమామహేశ్వరరావు జిల్లా వైద్య శాఖ అధికారి జి గీతా బాయి, వివిధ విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.