అంగన్వాడీ కేంద్రాలు మౌలిక వసతులు కల్పనతో బలోపేతానికి ఐసిడిఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వైసిడియస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని 489 అంగన్వాడీలకు ఒక్కొక్క అంగన్వాడికి రూ.16 వేలు చొప్పున కేటాయించిన నిధులతో గుర్తించిన పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలన్నారు. టెండర్లకు అనుకూలంగా లేనందున పంచాయతీరాజ్ శాఖ ఐ సి డి ఎస్ శాఖను సమన్వయం చేసుకుంటూ సుమారు 35 అంగన్వాడి సెంటర్ లను ఒక గ్రూపుగా తీసుకొని వాటికి కేటాయించిన మొత్తంతో పనులను చేపట్టాలన్నారు. డ్రైనేజ్ సౌకర్యం, స్టోరేజ్ ఎక్విప్మెంట్, పెయింటింగ్, మెస్సింగ్, బాత్రూంలో టైల్స్, తదితర పనులను చేపట్టాలన్నారు. చిన్నారులకు అవసరము లేకుండా అంగన్వాడి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వర్షాకాలం సీజన్లో మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి డి.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్.ఇ బి.వి గిరి, డిఈఈ టి.శ్రీనివాసరావు, పాల్గొన్నారు.