హెల్మెట్, సీటు బెల్టు మీ కుటుంబానికి రక్షణ కవచం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
హెల్మెట్ దారణ ప్రాణాలకు రక్షణ కవచంలా నిలుస్తుంది
హెల్మెట్ పెట్టుకొని వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయి
వాహన చోధకులు విధిగా సీట్ బెల్ట్ ధరించాలి …
రాష్ట్ర శాసన సభాపతి రఘురామకృష్ణరాజు
ప్రతి ఒక్కరూ రహదారుల భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలను నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని జరిమానాలు విధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు.
జాతీయ భద్రత మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా పోలీస్, రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖల ఆధ్వర్యంలో బుధవారం జువ్వలపాలెం రోడ్డు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో రాష్ట్ర ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా బైక్ నడిపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వీరితో పాటు
వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు, పట్టణలోని డాక్టర్లు, లాయర్లు, జొమోటో, సిగ్గి ఫుడ్ డెలివరీ బాయ్స్, తదితరులు జువ్వలపాలెం రోడ్డు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్టు పెట్టుకోకుండా వాహనములు నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని జరిమానాలు విధించాలని అన్నారు. జనవరి మాసం అంతా సడక్ సురక్ష జీవన రక్ష పేరుతో రోడ్ సేఫ్టీ లైఫ్ సేఫ్టీ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఈరోజు అధికారికంగా జువ్వలపాలెం రోడ్డు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున నిర్వహించిన అవగాహన బైక్ ర్యాలీలో పాల్గొనటం జరిగిందని అన్నారు. చాలామంది హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారన్నారు. హెల్మెట్ తో పాటు సీటు బెల్టు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. ఎవరయితే రూల్స్ ను అతిక్రమిస్తారో వారిపై చర్యలతో పాటు పెనాల్టీ విధించాలని పోలీస్ శాఖకు సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ బైకు నడపటం అరికట్టాలన్నారు. పెనాల్టీ అంటే డబ్బులు వసూలు చేయటం అని కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆన్నారు. హెల్మెట్ పెట్టుకోని వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా పబ్లిక్ ఫోటో తీసి పెట్టేలా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు రాష్ట్ర ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు సూచించారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వాహన చోధకులు నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలతో కుటుంబాలకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని రహదారుల భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రహదారి ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం అనేకమంది అమాయకులు ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రమాదాలను నివారించాలంటే వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరి హెల్మెట్ ధరించాలన్నారు. నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ను వినియోగించి వారి గమ్యాన్ని క్షేమంగా చేరుకోవాలని అన్నారు. కంగారు కంగారుగా ప్రయాణాలు చేసి విలువైన ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. రోడ్ సేఫ్టీ అనేది ఒక్క రోజుతో పరిమితం కాకూడదన్నారు. ప్రజలు కూడా దీనిపై అవగాహన కలిగి భాగస్వాములు కావాలన్నారు. 2025 సంవత్సరంలో జిల్లాలో 2009 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ఆదరణ కల్పించేవారు లేకపోతే ఆ కుటుంబం దిక్కు లేని వారు అవుతారని, రోడ్డున పడతారని అన్నారు. ముఖ్యముగా ద్విచక్ర వాహనాలపై వెళ్లే మహిళలు వస్త్రధారణ వలన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ప్రతి పౌరుడి బాధ్యత కీలకము అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అప్పుడే ప్రమాదాలు తగ్గించగలుగుతామని అన్నారు ద్విచక్ర వాహనాలు మీద ప్రయాణాలు చేసేవారు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలు మీద వెళ్లేవారు సీట్ బెల్ట్ ను ధరించాలని సూచించారు. మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపటం చాలా ప్రమాదకరమని అన్నారు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని అన్నారు ముఖ్యముగా తల భాగంలో దెబ్బలు తగిలితే కోలుకోవడం కష్టమవుతుందని అందు కారణంగా తలకు రక్షణగా హెల్మెట్ ఉండటం చాలా ఉత్తమమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా రోడ్డు భద్రత శాఖ అధికారి కృష్ణారావు, ఆర్టీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్, మున్సిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, తహసిల్దార్ రావి రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పట్టణంలో డాక్టర్లు, లాయర్లు, ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్, తదితరులు పాల్గొన్నారు.
