సేవ భావంతో విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీ ఆర్ఎస్ లో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు శ్రద్ధ వహించాలి.
జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి తొలిసారిగా ప్రత్యేకంగా నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో పాటు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, డిఎంహెచ్ఓ జి.గీతా బాయి, డ్వామా పిడి డా.కె.సి.హెచ్ అప్పారావు, డిఆర్డిఏ పీ డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన దివ్యాంగుల నుండి పిటిషన్లు స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులకు నేరుగా తమ సమస్యలను విన్నవించుకున్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కార ప్రత్యేక పి జి ఆర్ ఎస్ లో నేడు జరిగిన మొదటి సమావేశంలో 40 అర్జీలు రావడం జరిగిందన్నారు. దీనిలో ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, వైద్యం, ఉపాధి, 15 వేల రూపాయల పింఛన్లు మంజూరు, బ్యాంకు రుణాలు మంజూరుఫై పలు విజ్ఞప్తులు అందడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల నుండి అందిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు పీజీఆర్ఎస్ లో దరఖాస్తులు అందించేందుకు రావాలంటే అనేక వ్యయ ప్రయాసలతో పాటు సహాయకులు ఉండాలని, కావున అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సేవ భావంతో సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు. కొంతమంది నిరుద్యోగ దివ్యాంగులు ఉద్యోగాలు గురించి దరఖాస్తులు సమర్పించగా, ప్రత్యేక జాబ్ మేళా, శిక్షణ ఏర్పాటు ద్వారా అర్హత మేరకు ఉద్యోగాలు అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా స్కిల్ డెవలప్మెంట్ అధికారి డా.పి.లోకమాన్ కు సూచించారు. అదేవిధంగా జీవనోపాధి నిమిత్తం వ్యాపారాలు నిర్వహించుకునేందుకు రుణాలు మంజూరు చేయవలసిందిగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు రుణాల మంజూరుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా లీడ్ బ్యాంక్ మేనేజర్ కు సూచించారు.
తొలుత జాయింట్ కలెక్టర్ దివ్యాంగుల అర్జీల నమోదు ప్రక్రియ ఏ విధంగా జరుగుతున్నదో నమోదు కౌంటర్ల వద్ద సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని ఆన్లైన్ లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.
ఈ రోజు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక (పిజిఆర్ఎస్ లో)అందిన అర్జీలలో కొన్ని పిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి.
₹ నర్సాపురం నుండి నిప్పులేటి రాజేశ్వరిని వారి కుటుంబ సభ్యులు పి జి ఆర్ ఎస్ కు స్ట్రక్చర్ పై తీసుకురాగా జాయింట్ కలెక్టర్ స్వయంగా వారి వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు. 30 సంవత్సరాల నుండి తన కుమార్తె మంచానికి పరిమితమైందని దయచేసి 15 వేల రూపాయల పింఛను మంజూరు తల్లిదండ్రులు జాయింట్ కలెక్టర్ ని కోరగా, జాయింట్ కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఈ సమస్యను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.
₹ భీమవరం మండలం గూట్లపాడు గ్రామానికి చెందిన ఆర్. విమల అర్జీ సమర్పిస్తూ, తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానని, 90 శాతం వికలాంగత్వ ధ్రువీకరణ పత్రం ఉందని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరారు.
₹ మొగల్తూరు మండలం, కె పీ పాలెం గ్రామానికి చెందిన కందులపాటి సూర్య ప్రకాష్ రావు, తన కుమార్తె శాంతి కుమారి పుట్టిన నాటి నుండి నడవలేదని, మంచానికి పరిమితమై ఉందని, నెలకు రూ.15 వేలు పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
₹ పోడూరు మండలం, పెనుమదం గ్రామానికి చెందిన కంపాల యేసు రత్నం అర్జీని సమర్పిస్తూ, తాను వికలాంగురాలులని, జీవనోపాధి కొరకు చాలా ఇబ్బంది పడుతున్నానని, గ్రామంలో బడ్డీ కొట్టు పెట్టుకునేందుకు రుణం మంజూరు చేయాలని కోరారు.
ఈ ప్రత్యేక గ్రీవెన్స్ డే సందర్భంగా నలుగురు శారీరిక వికలాంగులకు క్రచెస్, మూగ, చెవుడు వున్న వికలాంగులకు నాలుగు టచ్ ఫోన్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అందజేశారు.
ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.అరుణకుమారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.వి.సూరిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్రప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.