Close

సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఉండి నియోజకవర్గంలో రూ.3 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు … రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు

Publish Date : 15/04/2025

ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, త్రాగునీరు వంటి మౌలిక వసతులతో పాటు సామాజిక భద్రత కూడా ఎంతో ముఖ్యమని దీనికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు స్పష్టం చేశారు. మంగళవారం ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద పి 4 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గమంతా దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజవర్గానికి చెందిన అనేకమంది దాతలు డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణంరాజుకు నియోజకవర్గ అభివృద్ధికి విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి వంద అడుగులకు ఒక సీసీ కెమెరా రావడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల ప్రజలకు భద్రత మరింత పెరుగుతుందన్నారు. ఇందుకు సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక దాతలు అందించిన ప్రతి రూపాయి పారదర్శకంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఖర్చు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నామని ఇందుకోసం ప్రతి పాఠశాలలోనూ ఆధునిక విద్యను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదేవిధంగా ఎస్ బి ఐ సహకారంతో ఆకివీడులో హై స్కూల్ ను అభివృద్ధి చేయడం, కెనరా బ్యాంక్ సహకారంతో ఆకివీడులోని ప్రభుత్వాసుపత్రి సమీపంలో పార్కు, యోగ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని మొట్ట మొదటిసారిగా ఉండి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు రావడం జరుగుతుందన్నారు. దీనివల్ల నియోజవర్గంలో నేరాలు తగ్గడమే కాక, మహిళలకు భద్రత పెరుగుతుందన్నారు.

ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా భద్రత కోసం భారీ ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

అనంతరం విరాళాలు అందించిన దాతలను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, సీఐ జగదీశ్వరరావు, తహసిల్దార్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్, స్థానిక నాయకులు కొత్తపల్లి నాగరాజు, మోటుపల్లి ప్రసాద్, డాక్టర్ బిలాల్, గొట్టుముక్కల సత్యనారాయణ రాజు, ఎం డి మదిని, తోట పణి, బత్తుల శ్యామల, కిమిడి నాగరాజు, మోపిదేవి శ్రీను, గంధం ఉమా బొల్లా వెంకట్రావు, ఉన్నమట్ల సాంబశివరావు, వంశి, మోపిదేవి శ్రీను, పొత్తూరు వెంకటేశ్వరరాజు, భూపతి రాజు తిమ్మరాజు, దాట్ల బోసురాజు, నియోజకవర్గంలోని పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.