Close

శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

Publish Date : 01/12/2025

గోదావరి క్రీడా సంబరాల ఆటల పోటీలలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొనాలి.

సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో డిసెంబర్ రెండో వారంలో నిర్వహించనున్న గోదావరి క్రీడా సంబరాల సంబరాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా ఉద్యోగుల మధ్య మంచి సత్సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయి అన్నారు. కావున, జిల్లా అధికారుల నుండి ఆఫీస్ సబార్డినేట్ వరకు ప్రతి ఒక్కరు ఈ క్రీడలలో పాల్గొనాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా మహిళలు అందరూ తప్పనిసరిగా ఈ క్రీడ పోటీలలో పాల్గొనాలన్నారు. ఈ క్రీడా పోటీలు డిసెంబర్ 2 వారం నుండి జనవరి 10వ తేదీ వరకు నిర్వహించబడ తాయన్నారు. చెస్, క్యారమ్స్, వాలీబాల్, షటిల్, త్రో బాల్, షార్ట్ పుట్, కబాడీ వంటి విభాగాలలో క్రీడ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. కావున ఈ క్రీడా పోటీలలో పాల్గొనేవారు ముందుగా నేటి నుండి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ముందుగా జిల్లాలోని మూడు డివిజన్ల స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఎంపికైన వారిని జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనవలసి ఉంటుంది అన్నారు. జిల్లా అధికారులు తమ క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ ఈ క్రీడా పోటీలలోపాల్గొనేందుకు ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలలో క్రీడాకారులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలన్నారు. గోదావరి క్రీడ సంబరాల క్రీడల పోటీలలో అధికారులు, ఉద్యోగులు, ముఖ్యంగా మహిళ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, ఇది శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.