Close

వైద్య శిబిరాల ద్వారా అవగాహన పొందాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 29/09/2025

మహిళే కుటుంబానికి వెన్నెముక

మహిళా ఉద్యోగినిలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

జిల్లాలో అక్టోబర్ 17 నుండి నేటి వరకు 3,158 వైద్య శిబిరాలు నిర్వహించి, 1,05,425 మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి

జిల్లాలోని ప్రతి మహిళ వైద్య శిబిరాల ద్వారా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలి.

ఆరోగ్యంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

సోమవారం భీమవరం కలెక్టరేట్లో “స్వస్థ నారి – సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా మహిళా ఉద్యోగినిలు కోసం ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్యం అంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబాలు ఏర్పడుతుందని, ఆర్థిక అభివృద్ధితో పాటు, పిల్లలు కూడా మంచి విద్యను నేర్చుకోవడానికి తోడ్పడుతుందన్నారు. మహిళలు ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్య ఇస్తారని, పిల్లలు, భర్తకు పెట్టిన తర్వాత తల్లి త్యాగానికి, ప్రేమకి చిహ్నంగా మిగిలితే తినడం సర్వసాధారణం అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే మహిళలు కూడా సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడంలేదని, ఇటువంటి చర్యలు కారణంగా ఒకేసారి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. “స్వస్థ నారి – సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా నేటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక లక్ష 5 వేల 425 వైద్య పరీక్షలను పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా 249 మంది మహిళలలో క్యాన్సర్ నిర్ధారణ జరిగిందన్నారు. క్యాన్సర్ పరీక్షలను స్త్రీ కి సంబంధించిన వ్యాధులపై కూడా అవగాహన కల్పిస్తూ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యక్రమాన్ని ముందు తీసుకెళుతున్నామన్నారు. జిల్లాలో నెలకు రెండు లేక మూడు వైద్య శిబిరాలను నిర్వహించుకోవడం జరుగుచుండేదని, నేడు ప్రత్యేకతగా దేశ ప్రధానమంత్రి “స్వస్థ నారి – సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ద్వారా జిల్లా అంతట వైద్య శిబిరాలను నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం కూడా బాగుంటుందని అన్నారు. మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలని అన్నారు. వైద్య శిబిరాలు ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు వారు మాత్రమే వస్తారని అలా కాకుండా ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మన పెద్దవారు ఆరోగ్యకరమైన రాగిసంకటి, జొన్న సంకటి తదితర పౌష్టిక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండే వారిని అన్నారు. ప్రస్తుతం మనలో ఆహార అలవాట్లు మారాయని, కష్టపడడం కూడా తగ్గిపోయిందని, అందువల్ల రోగాలు కూడా పెరిగిపోవడం జరుగుతోందని అన్నారు. మనమందరం మంచి లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవాలని అన్నారు. ఏ రోగాలు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలన్న మెడికల్ క్యాంపుల ద్వారా తెలుసుకోవాలని అన్నారు. మెడికల్ క్యాంపు లందు ప్రివెన్షన్ ఫోకస్ చేస్తే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్యవంతమైన పశ్చిమగోదావరిజిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధవహిస్తూ “స్వస్థ నారి – సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి మాట్లాడుతూ “స్వస్థ నారి – సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమం సెప్టెంబర్ 17న ప్రారంభించడం జరిగిందని, అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలను నిర్వహించి స్త్రీలకు స్క్రీనింగ్ టెస్ట్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఏం చర్యలు తీసుకోవాలి, గైనిక్ సమస్యలు రాకుండా ఏమి చర్యలు తీసుకోవాలి, టీబి, మధుమేహ వ్యాధి తదితర రోగాల బారిన పడకుండా ఏం చర్యలు తీసుకోవాలి, ముందస్తుగా ఎలా జాగ్రత్త పడాలి తెలుసుకోవాలన్నారు.

తొలుత జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వివిధ శాఖల ఉద్యోగినుల కొరకు ఏర్పాటుచేసిన ఆయా విభాగాలను పరిశీలించి, సంబంధిత డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా ఉద్యోగినిలు చేయించుకుంటున్న వైద్య పరీక్షలను దగ్గర ఉండి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి, ఐసిడియస్ పిడి డి.శ్రీలక్ష్మి, ఎన్టీఆర్ భరోసా డిస్టిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, డిఐఓ డాక్టర్ దేవ సుధాలక్ష్మి, జిల్లా టీబి, లెఫ్ట్ సి నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.రవిబాబు, డిపిఎమ్ఓ ధనలక్ష్మి, డిప్యూటీ డెమో ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ హెచ్ఇవో వి ఎస్ ఆర్ కె కుమారి, వివిధ విభాగాల వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్క్ లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.