విస్సాకోడేరు వంతెన పక్కన ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి నివేదిక సమర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
Publish Date : 17/12/2024
![](https://cdn.s3waas.gov.in/s381448138f5f163ccdba4acc69819f280/uploads/2024/12/2024122029.jpg)
మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తో కలిసి విస్సాకోడేరు వంతెన పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఎంత విస్తీర్ణం ఉంది కొలతలు వేసి తెలియజేయాలన్నారు. ప్రభుత్వ పరంగా భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంలో భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ త్రినాధరావు, టౌన్ ప్లానింగ్ అధికారి, తదితరులు ఉన్నారు.