విశ్వావసు నామ నూతన సంవత్సరంలో జిల్లా అన్ని రంగాలలో పురోగమించి, అందరి జీవితాలలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఆదివారం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ఘనంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా నీటి సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టరుకు మంగళ వాయిద్యాల నడుమ దేవాదాయ ధర్మాదాయ శాఖ, వేద పండితులు, అర్చకులు స్వాగతం పలికగా, ఉగాది పండుగ సందర్భంగా గోమాతకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతిని వెలిగించి విశ్వావసు నామ ఉగాది వేడుకలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలో తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగర, ఎలా అయితే ఉంటాయో మన జీవితంలో వచ్చే మంచి, చెడులను సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఉగాది పర్వదినం రోజున భగవంతుడు, మావుళ్ళమ్మ తల్లి ఇచ్చిన ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు ఆనందంతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో వ్యాపారాల అభివృద్ధితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ విశ్వావసు నామ ఉగాది పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.
భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విశ్వావసు నామ ఉగాది సందర్భంగా అన్ని రంగాల వారికి శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నరన్నారు. ఇంత వైభవంగా ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వావాస నామ సంవత్సరం గ్రహ స్థితులు అందరికీ అనుకూలంగా ఉన్నాయని, అందువల్ల అందరం సమిష్టిగా కృషిచేసి పశ్చిమగోదావరి జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్దాం అన్నారు. ప్రతిభావంతులైన కవులను, కళాకారులను సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అధికారులు మరింత కష్టపడి పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు.
రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కనుల పండుగగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు జరుగుతున్నాయని, పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సర పంచాంగం ప్రతి రంగానికి అనుకూలంగా ఉన్నందున ధైర్యంతో ముందుకు వెళ్దామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తే చేపట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది అని అన్నారు.
ఉగాది పండుగను పురస్కరించుకుని ఈమని రామచంద్రా స్వామి పంచాంగ శ్రవణం వినిపించారు. విశ్వావసు నామ సంవత్సరంలో ఆర్థికంగా, రాజకీయ, సామాజికంగా, అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందని, పాల ఉత్పత్తులు, మత్స్య సంపద, పంటలు సమృద్ధిగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. వేద పండితులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శాసనసభ్యులు జిల్లా అధికారులకు వేద ఆశీర్వచనాలు అందించి ఆశీర్వదించారు. పలువురు కవులు కవి సమ్మేళనం నిర్వహించి ఆహుతులను ఉత్సాహపరిచారు. కవి సమ్మేళనంలో భీమవరంకి చెందిన డి.రామనాగేశ్వర రావు, పంపన సాయిబాబు, చిర్రావూరి లక్ష్మీనారాయణ, కాళ్లకూరిశర్మ వేదికపై వారి చూపిన సాహిత్య పట్టమను అభిమానులను, అహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు వండర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులచే భరతనాట్యం భారతీయ విద్యా భవన్ పాలకొల్లు విద్యార్థులచే ఈ ఉగాది పండుగ క్లాసికల్ డాన్స్, శ్రీ చైతన్య స్కూల్ భీమవరం విద్యార్థులచే అలరుల కురియగా కూచిపూడి నృత్యం, శ్రీ ఉమా కూచిపూడి నాట్య కళాక్షేత్రం భీమవరం వారిచే ఓం శార్వాణి- ఓం రుద్రాణి, కూచిపూడి నృత్యం, శ్రీ చైతన్య స్కూల్ భీమవరం విద్యార్థులచే మూషిక వాహన కూచిపూడి నృత్యం, శ్రీ ఉమా కూచిపూడి నాట్య కళాక్షేత్రం వారిచే స్వాగతం కూచిపూడి నృత్యం, శ్రీ చైతన్య స్కూల్ భీమవరం విద్యార్థులచే అవురా అవురా కూచిపూడి నృత్యం, శ్రీ ఉమా కూచిపూడి నాట్య కళాక్షేత్రం భీమవరం వారిచే శంభో కూచిపూడి నృత్యం, శ్రీ బార్డోలి స్కూల్ విద్యార్థులచే శివతాండవం నిత్యం ఆధ్యాంతం సబికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
చివరిగా కవులను, కళాకారులను, సంఘ సేవకులను జిల్లా కలెక్టర్ చేతులమీదుగా శాలువా కప్పి, మెమెంటో, సర్టిఫికెట్ను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఆహుతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ, జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఉగాది వేడుకలను మరింత శోభాయమానంగా జిల్లా యంత్రాంగం తరపున నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా నీటి సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ రాజు, జిల్లా దేవాదాయశాఖ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కళాకారులు, కవులు, విద్యార్థులు, చిన్నారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.