Close

విభిన్న ప్రతిభావంతులు తమలో నిబిడికృతమైన నైపుణ్యాలను గుర్తించి సాధన చేస్తే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Publish Date : 10/12/2025

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు-2025 సందర్భంగా బుధవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విభిన్న ప్రతిభావంతులు జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా క్రీడలలో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు తమలోని నిబిడీకృతమైన నైపుణ్యాన్ని వెలికి తీసి దానిపై పట్టు సాధిస్తే ఉన్న స్థితికి చేరుకోవచ్చు అన్నారు. శరీరంలో ఒక అవయవ లోపం స్థానంలో భగవంతుడు మరో నైపుణ్యాన్ని ప్రసాదిస్తారని దానిని వెతికి పట్టుకోవాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలలో విజేతలకు అభినందనలు తెలియజేశారు. గెలుపొందిన వారు మాత్రమే కాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలేనన్నారు. ప్రపంచం మారుతోందని కేవలం ప్రభుత్వ పథకాల కోసమే కాకుండా బయట ప్రపంచంలో అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు ప్రపంచంలో అనేక రంగాలలో విభిన్న ప్రతిభావంతులు తన ప్రతిభ పాటవాలను చూపి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారన్నారు.

తొలుత విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్స్ నాయకులు, విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇంటింటికి రేషన్ అందించాలని, వికలాంగ పెన్షన్ తో పాటు సబ్సిడీతో కూడిన రుణాల అందించాలని, అంత్యోదయ కార్డు, ఇంటి స్థలం ఇప్పించాలని, జిల్లా కలెక్టరేట్లో వారంలో ఒకరోజు ప్రత్యేకంగా విభిన్న ప్రతిభావంతులకు సమస్యల పరిష్కారానికి ఒక రోజు కేటాయించాలని సంఘ నాయకులు బి.వెంకటరమణ,జి. సంపద రావు, సిహెచ్ తాతారావు, టి.రాము, నండూరి రమేష్, ఎ. నటరాజ్, కె. సురేష్, వి.లక్ష్మణ్, సిహెచ్ నాగ శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత సమస్యలు పరిష్కారానికి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అనంతరం వివిధ విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్లకు చెందిన నాయకులు ఎం.సందీప్ వర్మ, జె.రాముడు, పి.ఏడుకొండలు, ఉమా మహేష్, టి.రాము, ఎ.నటరాజ్, ఎన్ఎస్ఎస్ రాములు, పి.లక్ష్మణరావు, కె.సురేష్, సాయి దుర్గ, డి.సురేష్, సిహెచ్ నాగ శ్రీనివాస్, కె.వీర్రాజు, కె.శ్రీనివాసులను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి దుస్సాలువతో సన్మానించి, మెమొంటోలను అందజేశారు.

అనంతరం క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు జాయింట్ కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. దాయన సురేష్ చంద్ర జి వ్యాఖ్యాతగా వ్యవహరించారు

ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి.రామ కుమార్, సూపరింటెండెంట్ కె.కిషోర్, విభిన్న ప్రతిభావంతులు వారి కుటుంబ సభ్యులు, ఎన్ సి సి వాలంటీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.