Close

వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి మేలైన సేవలను పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు.

Publish Date : 24/12/2025

జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా
భీమవరం పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు, సేవలు విషయంలో వినియోగదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రజలు ఆన్లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, ఆన్లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వస్తువుల కొనుగోలులో నాణ్యతలను పరిశీలించాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు తీసుకుని భద్రపరుచుకోవాలన్నారు.

జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్రత్వం పోటీలలో మొదటి 3 స్థానాలను సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను జాయింట్ కలెక్టర్ చేతుల మీదగా అందించి విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు చట్టాలపై అవగాహన కల్పించే గోడ పత్రికలను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్ఓ ఎన్ సరోజ ఏఎస్ఓ రవిశంకర్, తాసిల్దార్ రావి రాంబాబు, తూనికలు కొలతల అధికారి, ఆహార భద్రతా అధికారి, కమర్షియల్ టాక్స్ అధికారి తదితరులు పాల్గొన్నారు.