వసతి గృహాలలో చదువుకున్న వారు ఎంతోమంది ప్రయోజకులు అయ్యారని, వారి స్ఫూర్తిగా మీరు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలను ఎదగాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
ఆదివారం తణుకు పట్టణం 13వ వార్డు ఇరగవరం రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షలు ప్రత్యేక నిధులతో హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణలో హాస్టల్ లోపల ఫ్లోరింగ్ చేయించి ఫౌండేషన్ ఎత్తు, టైల్స్ నిర్మాణము చేసి ఆధునీకరించిన పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. వసతి గృహం విద్యార్థినులతో ఆమె మాట్లాడారు. గతంలో వర్షము కురిస్తే వర్షము నీరు హాస్టల్ లోపలికి వచ్చేదని దానితో మేము చాలా ఇబ్బంది పడేవారు మనీ హాస్టల్ ఫ్లోరింగ్ చేయించి టైల్స్ నిర్మాణము వంటి పనులు ఆధునీకరణ చేయడం వలన వర్షపు నీరు లోపలికి రావటం లేదని మాకు శుభ్రముగా ఉందని కలెక్టర్ వద్ద విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారిని అభినందిస్తూ, చేపట్టిన పనులపై సంతృప్తినే వ్యక్తం చేశారు. త్వరలో డైనింగ్ హాలు నిర్మాణం పనులు పూర్తిచేయాలని తెలిపారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజన పెడుతున్నారా, ఆహారం రుచిగా ఉంటుందా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, టాయిలెట్స్, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. హాస్టల్ ప్రాంగణమంతా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కష్టపడి చదువుకుని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. సమయం వృధా చేయకుండా కష్టపడి చదువుకునే ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చిన్ననాటి నుండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి చదువుకుని ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారని అన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి వసతి గృహాలు అణువైనవనిఅని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.
ఈ సందర్భంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చియ, తహసిల్దార్ అశోక్ వర్మ, ఏ.ఎస్.డబ్ల్యూ టివిడి ప్రసాద్, వసతి గృహం అధికారి వై.అరుణ, అన్వర్ , తదితరులు ఉన్నారు.