Close

లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు

Publish Date : 16/05/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పి సి & పి ఎన్ డి టి యాక్ట్, ఏఆర్టి అండ్ సరోగసి యాక్ట్ అమలుపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదని, తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమాజంలో స్త్రీ, పురుషు బేధం ఉండకూడదని, అన్ని రంగాల్లో స్త్రీలు ముందంజలో ఉంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. స్కానింగ్ సెంటర్లో వెల్లడించిన, పరీక్షలు నిర్వహించుకునే వారు ప్రలోభ పెట్టీ ఫలితాలను తెలుసుకుంటే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని తెలిపారు. గత సంవత్సరం కంటే కాళ్ళ , పెనుమంట్ర మండలాల్లో సెక్స్ రేషియో తగ్గడంపై తగిన సమీక్ష నిర్వహించాలని డిఎంహెచ్ఓ ను ఆదేశించారు. జిల్లాలోని 159 స్కానింగ్ సెంటర్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలన్నారు. ఆ నిద్ర వస్తున్నారు. అలాగే ఏ విధమైన అనారోగ్య కారణాలు లేకుండా రెండవ కాన్పు, ఇద్దరు ఆడపిల్లలు ఉండి మూడవ కాన్పు అబార్షన్ చేయించుకున్న వారి జాబితాను క్రోడీకరించి విపులంగా సమీక్షించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అకారణ అబార్షన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు కొత్త స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులను, ఒక స్కానింగ్ సెంటర్ రెన్యువల్ కు, తొమ్మిది రిజిస్టర్ స్కానింగ్ సెంటర్లలు మోడీఫికేషన్స్, ఏఆర్టి లెవెల్ లో అనుమతికి ఒక దరఖాస్తు, డెకాయ్ ఆపరేషన్ నిర్వహణకు చార్జీలను రూ.వెయ్యి నుండి రూ.1800 కు పెంచడం, మూడు స్కానింగ్ మిషన్లను యూపీహెచ్సీ నుండి సిహెచ్ లకు తరలింపు, ఒక స్కానింగ్ సెంటర్ మూసివేతకు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. చర్చించిన అనంతరం అన్ని అంశాలను సమావేశంలో ఆమోదించడం జరిగింది. భీమవరం డివిజన్లో ఎనిమిది ప్రభుత్వ, 71 ప్రైవేటు మొత్తం 79 స్కానింగ్ సెంటర్లు, నరసాపురం డివిజన్లో 12 ప్రభుత్వ, 68 ప్రైవేటు మొత్తం 80 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయన్నారు. జిల్లాలో జనవరి నుండి మార్చి వరకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్లలో నమోదైన ఏఆర్టి అండ్ సరోగసి కేసులపై సమీక్షించారు.

చివరిగా దోమల రకాలు వ్యాప్తి చేయు వ్యాధులు, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఎండ తీవ్రతకు గురికాకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, డెంగ్యూ వ్యాధి లక్షణాలకు సంబంధించిన కరపత్రాలను, గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి. భీమారావు, డిఎం అండ్ హెచ్ డాక్టర్ జి.గీతా బాయ్, ఆర్డీవోలు దాసిరాజు, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో, డీఎస్పీలు ఆర్.జి జై సూర్య, శ్రీ వేద, డి.విశ్వనాథ్, ఇన్చార్జ్ డిపిఎమ్ఓ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి, డాక్టర్ భావన, తదితరులు పాల్గొన్నారు.