• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

రైతులు సమస్యలు తీర్చడానికే పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Publish Date : 25/03/2025

మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు సమస్యలు తీర్చడానికే పొలం పిలుస్తుంది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వరి పొలాలు సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం, రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడటం, లాభసాటి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం, తదితర అంశాలను వివరించడం జరుగుతుందని అన్నారు. అలాగే కోత దశకు వచ్చిన వరి పొలాలు 80 శాతం గింజలు గట్టిపడిన తరువాత కోత కోసి రెండు రోజులు పనలు ఆరబెట్టి 17 శాతం తేమ వచ్చినా తరువాత రైతు సేవా కేంద్రాలకు రైతులు ధాన్యమును తీసుకురావాలని అన్నారు. పి ఎం డి ఎస్ నవధాన్యాలు సాగుకు సంబంధించి పచ్చి రొట్ట పైరు విత్తనాలును 10 కేజీలు ప్యాకెట్లు రూ.700/- లు చొప్పున రైతులకు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. రబీ సాగు కోత కోయక ముందు పచ్చి రొట్ట విత్తనాలను చిమ్మాలన్నారు. తద్వారా భూమి సారవంతంమై అభివృద్ధి చెంది కార్బన్ శాతం పెరిగి పంట దిగుబడి బాగా వస్తుంది అన్నారు.

ఈ సందర్భంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి రైతులు పలు సమస్యలను వివరించారు. చిరిగిన గోనే సంచులు ఎక్కువగా వస్తున్నయని వాటి వల్ల ఇబ్బంది కలుగుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులు వద్ద నుండి వచ్చే సంచులకు నంబర్లు ఇవ్వడం జరుగుతుందని, వచ్చిన సంచులకు నెంబర్లు ఇవ్వడం వలన వాటి స్థానంలో తిరిగి కొత్త సంచులను తీసుకోవటం జరుగుతుందని అన్నారు. పెంటపాడులో ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ముదునూరుపాడు
గ్రామం వద్ద రైతులు కోసిన వరి పొలాలు ఎక్సెల్ పది రకం ధాన్యమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సందర్భంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యమును అమ్ముకొని ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని అన్ని రకముల ధాన్యమును కొనుగోలు చేయటం జరుగుతుందని రైతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖతీబ్ కౌశల్ భానో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వ్యవసాయ సహాయ సంచాలకులు పి.మురళీకృష్ణ, ఏవో కె.పార్థసారథి, తహశీల్దార్ సీతారత్నం, ఎంపిడిఓ, ఎం ఎల్ ఓ రవి, గ్రామ సర్పంచ్ డి.వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కె.వెంకట్రావు, నీటి సంఘం అధ్యక్షులు ఎం.సూర్యచంద్రరావు, బాబు, ధనరాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.