Close

రైతులు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రుణాలు పొందాలంటే ఈ పంట నమోదు తప్పనిసరి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 11/02/2026

నరసాపురం మండలం ఎల్.బి చర్ల భైరవపాలెంలో రైతులు కూనపురెడ్డి మల్లిఖార్జునరావు, బర్రి ముసలయ్య ఈ-క్రాప్ బుకింగ్ ను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో రైతుతో మాట్లాడుతూ ఏ వెరైటీ వేశారు, విస్తీర్ణం ఎంత, పంట రుణం ఏమైనా తీసుకున్నారా, ఎప్పటికీ కోతలకు వస్తుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ పంట నమోదు రైతుతో కలిసి వారి పొలం దగ్గరకు వచ్చి ఈ క్రాప్ బుకింగ్ చేసేవారని, ఇప్పుడు ఈ విధానాన్ని ప్రభుత్వం సరళతరం చేస్తూ రైతే స్వయంగా ఈ పంట నమోదుకు అవకాశం కల్పించిందన్నారు. దీనికోసం ప్రభుత్వం ఏపీ ఏ ఐ ఎం ఎస్ యాప్ (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం) ను రూపొందించి అమల్లోకి తీసుకువచ్చింది అన్నారు. ఇప్పుడు రైతు ఈ పంట పక్రియను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ-క్రాప్ బుకింగ్ చేసుకోవడం వల్ల రైతులకు అనేక ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రుణాలు సులభంగా అందుతాయని తెలిపారు. పంటల డేటాను డిజిటల్‌గా రికార్డ్ చేసి పరిహారాలు, బీమా వంటివి వేగంగా అందించడానికి సహాయపడుతుందన్నారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు, సున్నా వడ్డీ పథకాలు సులభంగా పొందవచ్చు అన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వంటి పంట బీమాలో ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటే చేరవచ్చు అని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, యంత్రాలపై సబ్సిడీలు, రాయితీలు లభిస్తాయి అన్నారు. వర్షాలు, తుఫానులు, కరువు వంటి సందర్భాల్లో పంట నష్టానికి త్వరగా పరిహారం వస్తుంది, ఈ పంట డేటా ఆధారంగా లెక్కింపు సులభం అవుతుందన్నారు. పి యం కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి పథకాల లబ్ధి పొందడానికి ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి అని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్మకం చేయడానికి వీలవుతుంది అన్నారు. ప్రతి ఒక్క రైతు ఈ పంట నమోదును తప్పకుండా పూర్తి చేసుకోవాలి జిల్లా కలెక్టర్ తెలిపారు.

తొలుత దర్భరేపు వెస్ట్ పూడిక తీత పనులపై స్థానిక రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. షట్టర్లు ఏర్పాటు, 8.3 కిలోమీటర్ల పొడవునా వెస్ట్ దబ్బరేవులో పూడికతీత పనులు చేపట్టడం వలన సుమారు తొమ్మిది పంచాయతీల్లోని రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం కలుగుతుందని కలెక్టర్ కు విన్నవించడం జరిగింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రతిపాదనలను తయారు చేయించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

ఈ సందర్భంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఆర్డీవో దాస్ రాజు, ఏడీఏ ఎంవీఎస్ ప్రసాద్, ఎంఏఓ జోషీల, విఏఎ నాగజ్యోతి, డెల్టా కమిటీ చైర్మన్ గుబ్బల మర్రి రాజు, తహాసిల్దార్ ఐ వి వి సత్యనారాయణ, ఎంపీడీవో ఎం.అసుర రెడ్డి, ఈవోపీఆర్డి కె.నాగేంద్ర కుమార్, రైతులు పాల్గొన్నారు.