రైతులు కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు సూత్రాలపై అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం పాలకోడేరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి లేఖను ఆవిష్కరించారు. రైతులందరికీ స్వయంగా ఆయన చేతులతో లేఖను అందజేశారు. రైతులను కలిసి మాట్లాడారు. రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి భద్రత ఆధారిత వ్యవసాయ సాంకేతికత వ్యవసాయం ఆహార సంస్కరణ ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలు పై రైతులకు వివరించారు. రైతులు మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసే విధానమును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. రైతుల జీవనోపాధి ఆర్థిక స్థితి నైపుణ్యాభివృద్ధితో అంచనావేసి రైతుల్లో శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం రైతన్న ఇంటింటా మీకోసం సర్వే కార్యక్రమం చేపట్టిందన్నారు. 24తేదీ నుండి 29 వ తేదీ వరకు జరిగే వ్యవసాయ అనుబంధ శాఖ సిబ్బందితో ఇంటింటా సర్వే కార్యక్రమమును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్నదాత సుఖీభవ అర్హులైన వారి ఖాతాల్లో జమ అయినదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతు సెల్ ఫోనులో యాప్ ను ఇన్స్టాల్ చేయాలని ఇంటింటా సర్వే చేస్తున్న సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటా ప్రచారంలో రైతుల నుంచి సేకరించి సూచనలు సలహాలు ప్రణాళిక రూపంలో తయారుచేసి డిసెంబర్ 3 వ తేదీ రైతు సేవా కేంద్రం వద్ద రైతులందరికీ సమావేశం నిర్వహించి రూపొందించిన ప్రణాళికను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రైతుల సౌలభ్యం కొరకు ప్రభుత్వం అమలు చేసిన ఐదు సూత్రాలపై రైతులు అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సి హెచ్ శ్రీనివాస్, ఇన్చార్జి తాహసిల్దార్ రఘు, మండల వ్యవసాయ శాఖ అధికారి బి.సంధ్య, సొసైటీ సెక్రటరీ నరసింహా రాజు, పశువైద్యాలు డాక్టర్ హేమ, సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.