Close

రభీ ధాన్యం కొనుగోళ్లకు వేగవంతమైన చర్యలు ప్రారంభించాలని, కొనుగోళ్లలో రైతుకు లాభం చేకూర్చేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 01/04/2025

మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు టి.రాహుల్ కుమార్ రెడ్డి ధాన్యం సేకరణ కమిటీ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమగోదావరిజిల్లాలో రబీ 2024-25 సీజనుకుగాను రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు 348 రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేయడం జరిగినదన్నారు. ఈ రబీ సీజనులో కనీస మద్దతు ధర ప్రతి క్వింటాల్ ధాన్యముకు సాధారణ రకం రూ.2,300/- చొప్పున మరియు గ్రేడ్-ఏ రకానికి రూ.2,320/- గా నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి, జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటుగా, అనేక పర్యాయములు సమావేశములు ఏర్పాటు చేసి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే రైతులకు పూర్తి అవగాహనా కలిగించే క్రమంలో గ్రామాల, మండలాల వారీగా జిల్లా మొత్తం క్షేత్ర స్థాయిలో “పొలంపిలుస్తుంది” కార్యక్రమం ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల వద్ద పని చేయుటకు గ్రామా వ్యవసాయ సహాయకులు, సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లును, రైస్ మిల్లుల వద్ద భద్రతా అధికారులు మరియు వాహన కదలిక పర్యవేక్షణా అధికారులను నియమించడం తో పాటుగా, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో ఇప్పటికే సాంకేతిక శిక్షణా తరగతులను పూర్తి చేయడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణకు కావలసిన గోనెసంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సకాలంలో సక్రమమైన అత్యుత్తమ సేవలు తగిన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజరు టి.శివరామ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లాపౌర సరఫరాల అధికారి ఎన్.సరోజ,, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.