యువత, విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు లోబడకుండా చూసే ప్రధాన బాధ్యతను ఎక్సైజ్ అధికారులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
జిల్లాలో గంజాయి వినియోగం అనే మాట ఎక్కడ వినిపించకూడదు
యువత, విద్యార్థులు గంజాయి ఆకర్షణకులోను కాకుండా చూసే బాధ్యత ఎక్సైజ్ అధికారులదే
ఎక్సైజ్ అధికారులు గంజాయిపై తనిఖీలు ముమ్మరం చేయాలి.. కళాశాలల, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను తరచూ కలిసి మాట్లాడాలి…
మద్యం వినియోగదారులు సురక్ష యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి
మద్యం షాపులు, బార్లు వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధం అమలు జరిగాలి
జిల్లాలో జనవరి 2025 నుండి 24 అక్టోబర్, 2025 వరకు 442 అక్రమ మద్యం కేసులు, ఒక గంజాయి కేసు నమోదు
శనివారం భీమవరం కలెక్టరేట్ పిజఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సురక్ష యాప్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, గంజాయి ఇతర మత్తు పదార్థాల తనిఖీలు, ఎక్సైజ్ శాఖ ప్రగతి తదితర అంశాలపై ఎక్సైజ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజు మాట్లాడుతూ కల్తీ అక్రమ మద్యాన్ని పూర్తిగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సురక్ష యాప్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, వినియోగదారులు సురక్ష యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వినియోగదారుడు సురక్ష యాప్ ద్వారా బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే నోటిలకు సంబంధించిన తయారీ, బ్యాచ్ నెంబర్, తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు అన్న. కలెక్టర్ స్వయంగా బాటిల్ పై క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి బాటిల్ మీద వివరాలను, స్కానింగ్ వివరాలను సరిపోల్చి పరిశీలించారు. జిల్లాలో గంజాయి వినియోగం అనే మాటే వినిపించకూడదని, ఉక్కు పాదం మోపాలని ఎక్సైజ్ అధికారులను గట్టిగా హెచ్చరించారు. జిల్లాలో గంజాయి, తదితర మత్తు పదార్థాలపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, కళాశాలలో ప్రిన్సిపాల్స్ ను, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులను తరచూ కలిసి వివరాలను తెలుసుకోవాలన్నారు. ఎవరైనా విద్యార్థి డల్ గా ఉంటున్నాడా, తరచూ తరగతులకు గైరు హాజరు అవుతున్నారా, ప్రవర్తనలో ఏమైనా తేడాలు ఉన్నాయా, వారు దృష్టికి ఏమైనా ముత్తు పదార్థాలు వినియోగం సమాచారం వచ్చిందా తదితర విషయాలను కూలంకషంగా తెలుసుకోవాలన్నారు. మద్యం షాప్లు, బార్లు వద్ద మూడు శాతం ప్లాస్టిక్ నిషేధం అమలు జరిగేలా పర్యవేక్షించాలి అన్నారు. జిల్లాలో 2025 జనవరి నుండి అక్టోబర్ 24, 2025 వరకు 442 అక్రమ మద్యం కేసులను నమోదు చేసి 442 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. వీరి వద్ద 616.39 లీటర్ల మద్యాన్ని, 13 లీటర్ల బీరును స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. సుంకం చెల్లించని మద్యం పైన కూడా దృష్టి సారించాలన్నారు.
ఏలూరు జిల్లా ఆబ్కారీ సహాయ కమిషనర్ మరియు ఇన్చార్జి జిల్లా మధ్య నిషేధం మరియు ఆబ్కారీ అధికారి కెవిఎన్ ప్రభు కుమార్ మాట్లాడుతూ ఈ నెల అక్టోబర్ 12న తణుకు మూడో వార్డు పాలంగి రోడ్ లో ద్విచక్ర వాహనంపై గంజాయితో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించడం జరిగిందని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా, ఒక వ్యక్తి ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ను తోచివేసి పారిపోవడం జరిగిందని, హెడ్ కానిస్టేబుల్ కు ప్యాక్చర్ కూడా అయిందని తెలిపారు. వీరి వద్ద ఉన్న ఐదు కేజీల గంజాయిని, స్కూటీని సీజ్ చేయడం జరిగిందని, త్వరలో పారిపోయిన వ్యక్తిని కూడా పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఆబ్కారీ సహాయ కమిషనర్ మరియు ఇన్చార్జి జిల్లా మధ్య నిషేధం మరియు ఆబ్కారీ అధికారి కెవిఎన్ ప్రభు కుమార్, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.వి ప్రసాద్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సిఐ కళ్యాణ్ చక్రవర్తి, ఎస్.హెచ్.ఓలు కె.బలరామరాజు, ఎం.శ్రీనివాసరావు, స్వరాజ్యలక్ష్మి, ఎస్.రాంబాబు, మణికంఠ రెడ్డి, ఎం.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
