మిల్లింగ్ కార్యకలాపాల నుండి ఉత్పత్తి అయ్యే ఉప-ఉత్పత్తుల సద్వినియోగంపై ఆలోచన చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లా పౌర సరఫరాల మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పరిశ్రమల అధికారులతో సమావేశమై మిల్లింగ్ కార్యకలాపాల నుండి ఉత్పత్తి అయ్యే ఉప-ఉత్పత్తులను ఉపయోగించి పరిశ్రమల అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మిల్లింగ్ ఉప-ఉత్పత్తుల సమర్థవంతమైన వినియోగం ద్వారా విలువ జోడింపు (value addition)కు ఉన్న విస్తృత పరిధిని సమీక్షించారు. అలాగే జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. మిల్లింగ్ ఉప-ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమల అభివృద్ధి కొరకు మరియు చర్చలు జరపడానికి ఆసక్తి గల వారితో (stakeholders) కలిసి ఒక బిజినెస్ ఎక్స్పో సమావేశాన్ని నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, డీఎస్ఓ ఎన్.సరోజ, జిల్లా పరిశ్రమ శాఖ అధికారి యు.మంగపతి రావు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు పాల్గొన్నారు.