Close

మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 03/12/2025

బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో డిసెంబర్ 7 సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా వాల్ పోస్టరు, స్టిక్కర్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించి సాయుధ దళాల పతాకనిదికి తమ మొదటి విరాళం అందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భారత సైనికదళాల దేశభక్తి, సాహసము, త్యాగాల పట్ల దేశం గర్విస్తున్నదన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ లోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, దేశ సరిహద్దులు, వెలుపల మన సైనికుల ధైర్యసాహసాలకు దేశం గర్విస్తోందన్నారు. ఎంతోమంది సైనిక సహోదరులు దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలను అర్పించారని వారందరికీ మనమందరము ఎంతో ఋణపడి ఉన్నామన్నారు. ఈ సందర్భముగా సాయుధ దళాల పతాక నిధికి తమవంతుగా ప్రతి ఒక్కరూ విరాళాలు అందజేస్తే వారి కుటుంబాలకు ఎంతో సహాయపడుతుందన్నారు.

ప్రజలు అందించే విరాళాలు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, పశ్చిమ గోదావరి జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కౌంట్ నెం.62068471992, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN0012722 కు పంపుతూ, జిల్లా సైనిక సంక్షేమాధికారి మొబైల్ నెం.8688817953 మరియు ఈమెయిల్ zswowgoap@gmail.com పశ్చిమ గోదావరి జిల్లా వారికి తెలియజేయలన్నారు. ఈ విరాళములకు ఆదాయపుపన్ను చట్టము 1961 ద్వారా ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి ఎస్.కొండలరావు, ఎక్స్ జె.డబ్ల్యు.ఓ డి.వి రామయ్య, ఎ.వీరయ్య, ఎన్.సి.సి క్యాడెట్స్, తదితరులు పాల్గొన్నారు.