Close

మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 04/01/2025

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలోని తహసిల్దార్ కార్యాలయాల వద్ద జనవరి 6వ తేదీన గ్రామ సభలను నిర్వహించి అవగాహన కల్పించడంతోపాటు ప్రజల నుండి అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 6వ తేదీన ఆకివీడు మండలంలో మధ్యాహ్నం 1.00 గం.ల నుండి సా.5.00 గం.ల వరకు, మిగిలిన నాలుగు మండలాల్లో మధ్యాహ్నం 3.00 గం.ల నుండి సా.5.00 గం.ల వరకు గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోరడమైనది.