Close

భూ సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుచున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు

Publish Date : 17/12/2024

మంగళవారం అత్తిలి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవిన్యూ డివిజనల్ అధికారి ఖతీబ్ కౌసర్ భానో అధ్యక్షతన జరిగిన రెవిన్యూ సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సదస్సులో పలువురు రైతుల నుంచి భూ సమస్యలు, పాస్ బుక్కు సమస్యలు, రీ సర్వే, ముటేషన్ కు సంబంధించిన తదితర అంశాలపై పలువురు రైతులు నుండి 45 దరఖాస్తులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం కోసం గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు సందేహాలను సదస్సుల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు, సలహాలను చేసారు. డాక్యుమెంట్లు లేనివారు మరియు పూర్వం తప్పులు పడిన వాటికి సంబంధించినవి సరిచేయాలని అత్తిలి సబ్ రిజిస్టర్ ను ఆదేశించారు. రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపుగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏ విధంగా పరిష్కారం చేయాలని సూచనలు జారీ చేశారు. భూ సమస్యలపై పీజీ ఆర్ఎస్ లో వచ్చిన పిటిషన్లు కూడా మానవతా దృక్పథంతో పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని పట్టాదారు, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం రెవెన్యూ సదస్సులో సాగునీరు అందించే బోదే సమస్యపై రైతు ఇచ్చిన పిటిషన్ పై స్పందించిన జేసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి బోదేను పరిశీలించారు. కొలతల రికార్డు ప్రకారం బోధెను పునరుద్దించాలని సంబంధించిన శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డిఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసిల్దార్ దశిక వంశీ, మండల సర్వే, డీటీలు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు, గ్రామ రెవెన్యూ అధికారులు, వీఆర్ఏ లు, తదితరులు పాల్గొన్నారు.