Close

భూ సంబంధిత రికార్డులను పారదర్శకంగా కచ్చితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Publish Date : 21/01/2026

భూ సంబంధిత సేవల అమలును పర్యవేక్షించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కాళ్ల మండలం కోనాలపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులుతో మాట్లాడి పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేయవలసిన రైతులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు గోకరాజు శ్రీనివాసరాజు ఈకేవైసి పట్టాదారు పాసుపుస్తకాలు వివరాలను పరిశీలించారు. పాసు పుస్తకాల్లో నమోదైన భూ విస్తీర్ణ ఖాతా నంబర్లు, యజమాని పేరు, ఆధార్ అనుసంధానం, తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులతో మాట్లాడారు. పట్టాదారు పాస్ పుస్తకాలను భూ సంబంధిత రికార్డులను పారదర్శకంగా కచ్చితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ క్రమంలో పట్టాదారు పాసు పుస్తకముల ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని రైతులకు సూచించారు. ఈకేవైసీ కోసం రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో ఈ కేవైసీ చేయించుకోవచ్చని అన్నారు. రైతులు మధ్యవర్తులను ఎవర్ని ఆశ్రయించవద్దని అన్నారు. నేరుగా అధికారికంగా గ్రామ సచివాలయంలో మాత్రమే వివరాలను నమోదు చేయించుకోవాలని అన్నారు. రైతులకు సందేహాలు ఉంటే సంబంధిత రెవిన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. రైతులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంలో తహసిల్దార్ సుందర్ సింగ్, సిబ్బంది, రైతులు, తదితరులు ఉన్నారు.