Close

భారతదేశానికి పెద్ద ఎత్తున మారకద్రవ్యాన్ని అందిస్తున్న పరిశ్రమ మత్స్య సంపదఅని, దీనికి కారణం మత్స్యకారులే అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

Publish Date : 21/11/2025

నవంబర్ 21 ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సముద్ర, దేశీయ నది జలాలను పరిరక్షించి భావితరాలకు మత్స సంపదను అందించే లక్ష్యంతో 1997 సంవత్సరంలో 18 దేశాల ప్రతినిధులతో న్యూఢిల్లీలోని వరల్డ్ ఫోరం ఆఫ్ ఫిష్ హార్వెస్టర్స్ అండ్ ఫిష్ వర్కర్స్ అనే సంస్థ ప్రతి సంవత్సరం నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవంను జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. భావితరాలకు మత్స్య సంపదను అందించడమే కాకుండా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి సుస్థిరమైన ఆర్థిక భరోసాను కల్పించడమే లక్ష్యం అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేను, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ను ఈ ప్రాంతం వారినే, మత్స్య వర్గాలనే నియమించడం రాజకీయంగా కూడా పైకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నదన్నారు. మత్స్య సంపద ద్వారా అనేక కోట్లాది మందికి జీవనోపాది కల్పిస్తుందన్నారు. మత్స్యకారులు లేకపోతే ప్రాసెసింగ్ యూనిట్స్, ఆక్వా ఎగుమతులు లేవని గమనించాలన్నారు. భారతదేశానికి పెద్ద ఎత్తున మారకద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్న పరిశ్రమ మత్స్య సంపద అని, దీని ద్వారా విదేశీ మారకద్రవ్యం వస్తున్నది అన్నారు. దీనికి మూల కారణం మత్స్యకారులని గుర్తు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మత్స్యకారులకు చేయూతనివ్వాలని వారి జీవన ప్రమాణాలు పెంచాలని పిఎంఎంఎస్ వై పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖలో ఉన్న మత్స్యశాఖను విడదీసి ప్రత్యేకంగా ఒక క్యాబినెట్ మంత్రిని నియమించిన ఘనత నరేంద్ర మోడీ దన్నారు. వారికి ఆర్థిక భరోసా, ఆర్థిక భద్రత కల్పించాలనేదే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే పడవలు, వలలు, వేట సామాగ్రి, వాటి ఉత్పత్తుల అమ్మకానికి వాహనాలు పి ఎం ఏం ఎస్ వై ద్వారా కేంద్ర ప్రభుత్వం సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. కోస్తాతీరం కలుపుతూ నిర్మించిన ఎన్ హెచ్ 216 ను త్వరలో 4 లైన్ల రహదారిగా విస్తరించడం జరుగుతుందని, కోస్తాతీరాన్ని కలుపుతూ ఈ రహదారిని నిర్మించడం ప్రధాన ఉద్దేశం తీరప్రాంతాలలో ఉన్న మత్స్యకారుల సంపదను బయటికి తీసుకెళ్లడానికి అనువుగా ఉండేందుకు ఒంగోలు వరకు ఎన్ హెచ్ ని అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. సొంత ప్రయోజనాలు మానుకుని ప్రజల కోసం పనిచేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం పాలనలో ఉన్నాయన్నారు. మత్స్యకారులకు ప్రమాద ఎక్స్గ్రేషియా, 50 సంవత్సరాలకు పింఛను కు ఒక ఆలోచన చేస్తామన్నారు. మత్స్యకారుల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేని వారి విద్యను కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా మీ శాసనసభ్యులతో కలిసి ఆలోచన చేస్తానన్నారు. డ్రై ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు 50 లక్షలు రూపాయల నిధులను సమకూరుస్తానని, అలాగే మత్స్యకార గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులను సమకూర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పరిష్కరించుకొని మత్స్యకార సోదర సోదరీమణులందరికీ ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య సంపద ఏదైతే ఉందో అదేవిధంగా ఆక్వాకు సంబంధించినటువంటి అపార వనర్లు మన ప్రాంతంలో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 975 కిలోమీటర్ల విస్తరించిన తీరా ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లేరు, పులికాట్ సరస్సు లాంటి వాటితోపాటుగా డెల్టాకు సంబంధించినటువంటి కెనాల్స్, డ్రయిన్, చెరువులు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఒక మత్స్యకార సంపదకు నిలయంగా ఉందన్నారు. గత నాలుగు దశబ్దాలుగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంపదలో అగ్రగామి రాష్ట్రంగా ఉందన్నారు. అగ్రగామిగా ఉండడానికి ఆనాడు ఎన్టీఆర్ దగ్గరనుంచి ఈరోజు చంద్రబాబునాయుడు వరకు మత్స్య సంపదకు చేసినటువంటి కృషికి ప్రతిఫలం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు. మన జిల్లాలో వ్యవసాయానికి సమాంతరంగా ఆక్వా రంగం బలపడిందన్నారు. మత్స్యకారులు జీవన ప్రమాణాలు కచ్చితంగా పెరగవలసిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా మత్స్యకారుల జీవన ప్రమాణాలు, వాళ్ల జీవన శైలి ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కచ్చితంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్యకారుల జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది ఒక విద్య మాత్రమే అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. మత్స్యకారుల జీవన శైలి, జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం జారీచేసిన 217 జీవోను, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 217 జీవోను కూడా రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి నిరంత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధికి పక్క ప్రణాళికతో చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. మత్స్యకారులు ఏ సమస్య ఉన్న నా దృష్టి తీసుకురావచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కష్టజీవులు, గంగపుత్రులు, మత్స్యకారులు అందరికీ ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మన రాష్ట్రంలో గాని, మన దేశంలో గాని కోట్లాది మంది సముద్రంలో, జలవనులలో ఉన్న మత్స్య సంపద పై ఆధారపడి వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారన్నారు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో పర్యావరణంలో మార్పులు, చాలా పరిశ్రమలు నుంచి వచ్చే వ్యర్ధాలుతో సముద్రంలోనూ, నీటి వనరులలో ఉన్న మత్స్య సంపద పాడవుతుందని, వాటిని పరిరక్షించుకోవాలన్న ఒక్క లక్ష్యంతో మత్స్యకార సంపద మీద ఆధారపడి వారు, పర్యావరణ ప్రేమికులు అందరూ ఆలోచన చేసి వేట చేయడం వల్ల అంతరించిపోతున్న సంతతి, కొన్ని జాతులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని నివారించుకోవడానికి మనం ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని నిర్వహించుకుని అవగాహన పొందుతున్నామన్నారు. మన రాష్ట్రంలో, మన జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని, వాటిని ప్రతి మత్స్యకార కుటుంబం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద మత్స్యకారులను ఒక వంద మందిని గుర్తించి రామకృష్ణ మిషన్ ద్వారా ఒక బోటు, వల ఒక్కొక్కరికి 70 వేల రూపాయలు విలువైనవి అందజేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మత్స్యకార కుటుంబాలు అంతా వారి పిల్లలను మంచిగా చదివించాలన్నారు, చదువు ఒక్కటే అభివృద్ధికి మూలంగా నిరుస్తుందని ఈ సందర్భంగా హితవు పలికారు.

రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ చైర్మన్ రామరాజు, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, మాజీ శాసనసభ్యులు కొత్తపల్లి జానకిరామ్, తదితరులు మత్స్యకారుల సంక్షేమంపై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ర్రాష్ట్ర ఏపీ ఐఎస్ చైర్మన్ మంతెన రామరాజు,రాష్ట్ర మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మైల వసంతరావు, నరసాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పోత్తూరి రామరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గంటసాల వెంకటలక్ష్మి, మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు, కొత్తపల్లి జానకిరామ్, తాడేపల్లిగూడెం టిడిపి ఇన్చార్జ్ వల వల మల్లికార్జునరావు, ఆర్డీవో దాసిరాజు, తహసిల్దార్ ఐతం సత్యనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.